Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పీఏసీఎస్ చైర్మెన్ గంప వెంకటేష్ గుప్తా
నవతెలంగాణ-ఆమనగల్
ఆమనగల్ పీఏసీఎస్ ద్వారా 2022-23 ఆర్థిక సంవత్సరానికి రూ. కోటి పంట రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించి ఇప్పటివరకు రూ.30 లక్షలు రైతులకు రుణాలు అందజేసినట్టు డీసీసీబీ డైరెక్టర్, ఆమన గల్ కడ్తాల్ మండలాల పీఏసీఎస్ చైర్మెన్ గంప వెంకటేష్ గుప్తా తెలిపారు. రైతుల సంక్షేమం, వ్యవసాయ రంగం అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఆయన తెలి పారు. ఆమనగల్ ప్రాథమిక వ్యవసాయ సహకార సం ఘం కార్యాలయంలో బుధవార పాలకవర్గ సమావేశం చైర్మెన్ గంప వెంకటేష్ అధ్యక్షతన జరిగింది. సమావేశంలో సంఘం బలోపేతం, రుణాల రికవరీ, కొత్త రుణాల మంజూరు తదితర విషయాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు పీఏసీఎస్ ద్వారా తీసుకున్న రుణాలు సకాలంలో చెల్లించి రాయితీ పొందాలని కోరారు. ఈనెల 28వ తేదీలోగా రుణాలు చెల్లిస్తే, నాలుగు శాతం మాత్రమే వడ్డి పడుతుందనీ, నెలాఖరు దాటితే 13శాతం వడ్డీ చెల్లించాల్సి ఉంటుం దన్నారు. మార్చి 31వ తేదీ వరకు పాత బకాయిలు చెల్లింపునకు అవకాశం కల్పించినట్టు వెంకటేష్ చెప్పారు. పీఏసీఎస్ ఆధ్వర్యంలో రైతులకు కావాల్సిన ఎరువులు, విత్త నాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. డీసీసీబీ ద్వారా విదేశీ విద్యకు రూ.25 లక్షలు, స్వదేశీ విద్యకు రూ.10 లక్షల వరకు రైతుల పిల్లలకు రుణాలు అందిస్తున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాకే సహకార రంగానికి పూర్వ వైభవం ఏర్పడిందని వెంకటేష్ తెలిపారు. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని ఆయన సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల శ్రేయస్సు కోసం ఎంతటి త్యాగాలకైనా వెనకాడబోదని ఆయన స్పష్టం చేశారు. రైతులు తీసుకున్న పంట రుణాలు సకాలంలో చెల్లించి, వేరొకరికి రుణం అందించడానికి సంఘం ఆర్థిక పరిపుష్టికి సహకరించాలని వెంకటేష్ కోరారు. సమావేశంలో పీఏసీఎస్ వైస్ చైర్మెన్ దోనాదుల సత్యనారాయణ, డైరెక్టర్లు జోగు వీరయ్య, వెంకటేష్, దోల్య నాయక్, శ్రీపాతి వెంకట్ రెడ్డి, చెన్నమ్మ, జంగమ్మ, సీఈఓ దేవేందర్, పీఏసీఎస్ సిబ్బంది పాల్గొన్నారు.