Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆరు తులాల బంగారం, పది తులాల వెండి, రూ.10 వేల నగదు అపహరణ
నవతెలంగాణ -రాజేంద్రనగర్
తాళం వేసిన ఇంటిని లక్ష్యంగా చేసుకుని దుండగలు ఒక ఇంటి తాళం పగలగొట్టి ఇంట్లో ఉన్న బంగారం, వెండి ఆభరణాలు అపహరించారు. ఈ ఘటన గురువారం మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అస్సాం రాష్ట్రానికి చెందిన బిపిన్ నాథ్ బతుకు తెరువు కోసం ఐదేండ్ల క్రితం నగరానికి వచ్చాడు. కాటేదాన్‌లోని ఒక అద్దె ఇంట్లో తన భార్య సునీతాదేవి కూతురు హరిక దేవి తో కలిసి నివసిస్తున్నాడు. గురువారం ఉదయం భార్యాభర్తలిద్దరూ ఉద్యోగానికి వెళ్లారు. అయితే కూతురు హరిక దేవి స్కూల్ కు వెళ్లి ఇంటికీ వచ్చి తాళం తెరిచి చూసే ఇంట్లోనే వస్తువులన్నీ చిందర వందరగా పడి ఉండడంతో దొంగతనం జరిగినట్లుగా భావించి తల్లిదండ్రులకు తెలియజేశారు. వెంటనే తల్లిదండ్రులు మైలర్ దేవ్ పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న మైలర్ దేవ్‌పల్లి పోలీసులు రంగంలోకి క్లోస్ టీమ్‌తో వేలిముద్రలు సేకరించారు. ఆరు తులాల బంగారం, పది తులాల వెండి,10 వేల నగదు అపహరణకు గురైనట్లు బాధితులు పోలీసులకు తెలిపారు. సమీపంలోని సీసీటీవీ లను పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.