Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి
- లబ్దిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ
నవతెలంగాణ-ఆమనగల్
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తుందని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. గురువారం ఆయన హైదరాబాద్‌లోని తన నివాసంలో కల్వకుర్తి నియోజకవర్గానికి చెందిన పలువురు లబ్దిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పంపిణీ చేశారు. అనారోగ్యంతో బాధపడుతూ ప్రయివేట్ ఆస్పత్రిలో చికిత్స పొందిన జంగయ్యకు రూ.40 వేలు, యాదయ్యకు రూ.52 వేలు, మల్లయ్యకు రూ.19 వేలు, రాజుకు రూ.15 వేలు, జుమాణికి రూ.36 వేలు, బుజ్జికి రూ.14 వేలు, రూప్లాకు రూ.17,500లు, రాములమ్మకు రూ.15 వేలు, మేడిగడ్డ తాండా విజరు కుమార్ కు రూ.30 వేలు, బాబ్యా నాయక్ కు రూ.60 వేలు సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్సీ లబ్దిదారులకు అందజేశారు.
పలు వివాహ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్సీ
కల్వకుర్తి నియోజకవర్గంలో గురువారం జరిగిన పలు వివాహ వేడుకల్లో ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. కడ్తాల్ మండల కేంద్రంలో జరిగిన బీఆర్ఎస్ నాయకుడు మహేష్ గౌడ్ సోదరి వివాహంతో పాటు చిన్న వేములోని బావితండాలో జరిగిన వివాహ వేడుకల్లో ఎమ్మెల్సీ పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈసందర్భంగా స్థానిక సర్పంచ్ శ్వెతా భూనాథ్ ఎమ్మెల్సీ శారద కిషన్ కుమార్తె వివా హానికి రూ.16,116ల చెక్కును నూతన వధూవరులకు అందజేశారు. అంతకు ముందు ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి కడ్తాల్ పట్టణంలో హన్మానాయక్ సోదరుని గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీలు అనిత విజరు, కమ్లి మోత్యా నాయక్, సర్పంచ్ గూడూరు లక్ష్మీ నరసింహరెడ్డి, మాజీ సర్పంచ్‌లు వేణు గోపాల్, శేఖర్‌గౌడ్, సీనియర్ నాయకులు హన్మానాయక్, భాస్కర్ రెడ్డి, సురేందర్ రెడ్డి, రూపం వెంకట్ రెడ్డి, పడకంటి వెంకటేష్, విజరు రాథోడ్, నరేష్ నాయక్ పాల్గొన్నారు.