Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
నవతెలంగాణ-కందుకూరు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. గురువారం మహేశ్వరం నియోజకవర్గం కందుకూర్ మండల్ మీర్ఖాన్పేట్ గ్రామం నుంచి సుమారు 200 మంది గ్రామస్తులు తమ గ్రామ సమస్యలు పరిష్క రించాలని కోరుతూ ఆ గ్రామ సర్పంచ్ జ్యోతి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో మంత్రికి విన్న వించారు. ఏకలవ్య సంఘానికి వృత్తి పందుల పెంపకం కీలకమనీ, వాటి పెంపకానికి జాగ కేటాయించాలని మంత్రిని కోరారు. దీంతో ఆ సమస్య పరిష్కరిస్తామని మంత్రి హామీనిచ్చారు.ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ కాకి రాములు ముదిరాజ్, నాయకులు పాల జనార్ధన్, కాకి రవీందర్ ముదిరాజ్, బోమ్మ రాజు జంగయ్య, కాకి నవీన్, నందిగామ చంద్రశేఖర్, జెలా మహదర్, ఎరుకల సభ్యులు కుతాటి జంగయ్య, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.