Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జడ్పీటీసీ సభ్యులు జర్పుల దశరథ్ నాయక్
నవతెలంగాణ-ఆమనగల్
తండాల అభివృద్ధే బీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని జిల్లా పరిషత్ గ్రామీణాభివద్ధి శాఖ స్టాండింగ్ కమిటీ సభ్యులు, కడ్తాల్ మండల జడ్పీటీసీ సభ్యులు జర్పుల దశరథ్ నాయక్ అన్నారు. కడ్తాల్ మండలంలోని పల్లె చెల్క తండాలో జిల్లా పరిషత్ నిధుల నుంచి రూ.5 లక్షలు వెచ్చించి నిర్మిస్తున్న సీసీ రోడ్డు ప్రొసీడింగ్ పత్రం జడ్పీటీసీ సభ్యులు జర్పుల దశరథ్ నాయక్ గురు వారం పల్లె చెల్క తాండా సర్పంచ్ లోక్య నాయక్‌కు అందజేశారు. ఈ సంద ర్భంగా దశరథ్ నాయక్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళుతుంద న్నారు. అందులో భాగంగా జెడ్పీ నిధుల నుంచి మంజూరైన రూ.5 లక్షలతో నాణ్యమైన సీసీ రోడ్డును నిర్మించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తండా నాయకులు దీప్లా నాయక్, అశోక్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.