Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ అంజిలప్ప
నవతెలంగాణ- కందుకూరు
గొర్రె, మేకలకు నట్టల నివారణా మందులు తప్పనిసరిగా వేయాలని జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ అంజలిఅప్ప అన్నారు. గురువారం కందుకూరు మండల్ గూడూరు గ్రామములో గొర్రెలు, మేకల నట్టల నివారణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గొర్రెలు, మేకులు జీవాలు రోగాల బారిన పడకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్త వహిస్తూ మందులు, టీకాలు ఇప్పించాలని రైతులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో కందుకూరు పశువైద్య అధికారిణి డాక్టర్ రేవతి, సిబ్బంది మాధవి, ఆంజనేయులు, రైతులు శ్రీశైలం, సురేష్, శ్రీకాంత్‌రెడ్డి, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.