Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆపదలో ఉన్న పిల్లలు కనిపిస్తే
- 1098 లేదా 100 కు డయల్ చేయండి
- జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిని కె.లలిత కుమారి
నవతెలంగాణ-వికారాబాద్ కలెక్టరేట్
బాల్య వివాహాలు చట్టరీత్యా నేర మని, బాల్య వివాహాలను ప్రోత్స హించే వారిపై కఠిన చర్యలుంటాయని జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిణి కేతావత్ లలిత కుమారి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. బాల్య వివా హాలను పూర్తిగా రూపుమా పడానికి ప్రజల్లో విస్తృత అవగాహనా సదస్సులు నిర్వహించడం ద్వారా వికారాబాద్ జిల్లాలో బాల్య వివాహాలను పూర్తిగా అరికట్టడం సాధ్యమవుతుందని అన్నారు. 2021- 2022 సంవ త్సరంలో 228 బాల్యవివాహాలను నిలిపివేశామని వివరించారు. అందులో భాగంగానే సుమారు 8 మందిపై కేసు ఫైల్ చేశామన్నారు. పాఠశాలలు, కళాశాలల్లో అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఆపదలో ఉన్న పిల్లలు కనిపిస్తే 1098 లేదా 100 కు డయల్ చేయాలని సూచించారు. బడీడు పిల్లలను బడిలో చేర్పించాలని తెలిపారు. పిల్లలను పనిలో పెట్టుకోవద్దని హెచ్చరించారు. సుమారు 118 బాల కార్మికులను పని నుండి విముక్తి కల్పించినట్టు తెలిపారు. వీరిలో 42 పిల్లలను వారి సొంత ప్రాంతానికి పంపించినట్టు వివరించారు. పిల్లలు ఆపదలో ఉంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు.