Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పరిగి
వికలాంగుల హక్కుల కోసం పోరాటం ఉధృతం చేస్తామని ఎన్పీఆర్డీ జిల్లా గౌరవ అధ్యక్షులు ఎం. వెంకటయ్య అన్నారు. వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (ఎన్పీఆర్డీి) సంఘం ఆవిర్భావ దినోత్సవాన్ని గురు వారం పరిగి పట్టణ కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డా. బీఆర్ అంబేద్కర్ విగ్రహం ఎదుట జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్పీఆర్డీ సంఘం ఏర్పడి 13 ఏండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించినట్టు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వికలాంగులకు ఉన్న అనేక సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమయ్యారన్నారు. వికలాంగుల హక్కుల కోసం, వాళ్ళు రక్షణ, వారికి సంక్షేమ పథకాల అమలు కోసం తమ సంఘం అనేక పోరాటాలు చేసిందన్నారు. 2016 వికలాంగుల నూతన చట్టాన్ని సాధించడం, సంక్షేమ పథకాల్లో ఐదు శాతం వాటా సాధించామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు దశరథ్, మండల అధ్యక్షుడు అనంతలక్ష్మి, గణేష్, కవిత, శివకుమార్, తదితరులు పాల్గొన్నారు.