Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వికారాబాద్ డీసీసీ అధ్యక్షులు రామ్మోహన్‌రెడ్డి
నవతెలంగాణ- పరిగి
అదానీపై జాయిట్ పార్లమెంటరీ క మిటీ వేయాలని డీసీసీ అధ్యక్షుడు రామ్మో హన్‌రెడ్డి అన్నారు. గురువారం పరిగి పట్టణ కేంద్రంలోని ఆయన నివాసంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశం లో రామ్మోహన్‌రెడ్డి మాట్లాడారు.. నరేంద్ర మోడీ 2014 ఎన్నికలలో జన్ దన్ ఖాతాలలో రూ.15 లక్షలు వేస్తానని చెప్పి ప్రజలను మోసం చేశాడని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ వైఫ్యల్యాలపై చర్చ జర గకుండా బీజేపీ ప్రజల దృష్టి మళ్లీస్తోందన్నారు. మోడీ తన స్నేహితులకు దేశ ఖజానా దోచిపెడుతున్నారని ఆరోపించారు. మోడీ, అదానీ కుంభకోణం గురించి ప్రధాన ప్రతి పక్షంగా ప్రజల ముందు ఉంచుతామని తెలిపారు. రాహు ల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేలు పార్లమెంట్లో మాట్లాడిన అంశాలను చర్చ జరగకుండా ప్రభుత్వం అడ్డుకుంటుందని అన్నారు. ప్రపంచ ధనికుల జాబితాలో 609 స్థానంలో ఉన్న వ్యక్తి 2స్థానంలోకి ఎలా ఎగబాకాడో ప్రజలకు చెప్పాలని డిమాం డ్ చేశారు. అదానీ ఆస్తుల కుంభకోణంపై జాయింట్ పార్ల మెంటరీ కమిటీ వేయడానికి ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. మోడీ మిత్రుడు అదానీ ప్రపంచ వ్యాప్తంగా షెల్ కంపెనీలు ఏర్పాటు చేసి షేర్ల కుంభకోణం చేశారని ఆరోపించారు. అదానీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డీసీసీ ప్రధాన కార్యదర్శి హనుమంతు ముదిరాజ్, ఉపాధ్యక్షుడు లాలు కృష్ణప్రసాద్, పరిగి పట్టణ అధ్యక్షుడు ఎర్రగడ్డపల్లి కృష్ణ, కౌన్సిలర్ శ్రీను, మల్లేష్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు చిన్న నరసింహుల, రామాంజనేయులు, శివకుమార్, నాగవర్ధన్, జగన్, తదితరులు పాల్గొన్నారు.