Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ఎస్.హరీష్
నవతెలంగాణ - రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
ప్రభుత్వ లక్ష్యాలను త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అన్నారు. శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి మున్సిపల్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్, రాష్ట్ర స్థాయి ఉన్నత అధికారులతో కలిసి కంటి వెలుగు, పట్టణ ప్రాంతాలలో డబుల్ బెడ్రూంల నిర్మాణం, 58, 59, 76 ప్రభుత్వ జీఓల ప్రకారం చేయాల్సిన క్రమబద్దీకరణ, పోడు భూములు, ఆయిల్ పామ్ సాగుపై జిల్లా కలెక్టర్లతో వీడి యో సమావేశం నిర్వహించి, పలు ఆంశాలపై సమీక్షించా రు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హరీష్ మాట్లాడుతూ జి ల్లాలో కంటి వెలుగు కార్యక్రమం ద్వారా ఇప్పటి వరకు రెం డు లక్షల 60 వేల 87 మందికి కంటి పరీక్షలు నిర్వహిం చినట్టు తెలిపారు. 45,876 మందికి రీడింగ్ కళ్ళ అద్దాలు అందించినట్టు వివరించారు. 39,877 ప్రిస్క్రిప్షన్ అద్దా లకుగాను 5,439 మందికి అద్దాలను అందజేశామని చెప్పారు.