Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నర్కూడ వార్డు సభ్యుల డిమాండ్
- తహసీల్దార్, ఎంపీడీఓకు ఫిర్యాదు
నవతెలంగాణ - శంషాబాద్
హిమాయత్‌సాగర్ ఎఫ్టీఎల్, బఫర్ జోన్లో నిర్మి స్తున్న ప్రీ కాస్ట్ ప్రహరీ గోడను వెంటనే అడ్డుకోవాలని మండలం నర్కూడ గ్రామ వార్డు సభ్యులు డిమాండ్ చేశారు. సుల్తరోని చెరువు హిమాయత్‌సాగర్ పరివాహక ప్రాంతంలో నిబంధనలకు విరుద్ధంగా ప్రహరీ గోడ ని ర్మాణ ప్రదేశాన్ని వార్డు సభ్యులు శుక్రవారం సందర్శించా రు. అనంతరం శంషాబాద్ మండల తహసీల్దార్ శ్రీని వాస్‌రెడ్డి, ఎంపీఓ ఉషాకిరణ్‌కు వినతిపత్రం అందజే శా రు. ఈ సందర్భంగా వార్డు సభ్యులు మాట్లాడుతూ నర్కూ డ గ్రామ రెవెన్యూలో సర్వే నంబర్ 66లో హిమాయత్ సాగర్ విస్తరించి ఉన్న భూమి చుట్టూ ప్రహరీ గోడ నిర్మా ణం చేస్తున్నారని తెలిపారు. సందనవెల్లి కుంట, మల్లెవాని చెరువు, ఈడిగోనికుంట, తంబాలకుంట తదితర చెరువు ల నుంచి పెద్ద ఎత్తున వర్షాకాలంలో వరద ప్రవాహం వచ్చి హిమాయత్ సాగర్‌లో కలుస్తుందన్నారు. అయితే సాగర్ పరిరక్షణ కోసం నాటి ప్రభుత్వాలు నీటి కాలుష్యం కాకుం డా ఉండేందుకు 111 జీఓ తీసుకు వచ్చిన కొంతమంది అక్రమార్కులు తుంగలో తొక్కుతున్నారని అ న్నారు. ఎలాంటి అనుమతులు తీసుకోకుండా దౌర్జన్యంగా సాక్షాత్తు టౌన్ ప్లానింగ్ విభాగం విభాగంలో పనిచేసే ఒక ప్రభుత్వ ఉన్నతోద్యోగి అక్రమ నిర్మాణానికి పాల్పడుతుం డడం ఆందోళన కలిగిస్తుందన్నారు. పై భాగంలో వరద ప్రవాహాన్ని అడ్డుకుంటూ ప్రికాస్ట్ నిర్మాణం చేపట్టారని ఇ ప్పుడు ఏకంగా హిమాయత్‌సాగర్ వద్ద కవ్వగూడ, నర్కూ డ ప్రధాన రహదారి కల్వర్టుకే ఎసరు పెట్టారని తెలిపారు. గ్రామపంచాయతీ నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా చేపట్టిన ఫ్రీ కాస్టు ప్రహరీ గోడను వెంటనే కూల్చివేసి హిమాయత్ సాగర్‌ను రక్షించాలని డిమాండ్ చేశారు. ఈ ప్రదేశంలో నర్కూడ గ్రామానికి చెందిన తాగునీటి బోర్లు ఉన్నాయని, వాటిని సైతం పట్టా పొలంలో ఉన్నాయంటూ కలిపే సుకుని గోడ నిర్మిస్తున్నారని తెలిపారు. ఇక్కడ శ్మశాన వాటిక నిర్మించాలని ఇటీవల కాలంలో పంచాయ తీ ఆలోచన చేసిందని అయితే ఇక్కడ ప్రభుత్వ భూమి ఎంత ఉందో అధికారులు తెలపాలన్నారు. ప్రభుత్వ వాహనంలో వచ్చి సొంత పనులు చేసుకుంటూ నిబంధనలకు విరుద్ధం గా నిర్మిస్తున్న ఫ్రీ కాస్ట్ ప్రహరీ గోడను వెంటనే అడ్డుకోవా లని, భూ యజమానులపై వాల్టా చట్టం కింద కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు టి.కుమార్‌గౌడ్, పర్వతం వినోద్, నీరటి మహేష్, బ్యాగరి యాదగిరి, నాయకులు తోంట అశోక్, మిర్జాగౌస్ అలీ బేగ్, తదితరులు పాల్గొన్నారు.