Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పెండింగ్ పనులు త్వరితగతి పూర్తిచేయాలని అధికారులకు ఆదేశం
నవతెలంగాణ- రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
'మన ఊరు - మనబడి'లో భాగంగా ఎంపికైన పాఠ శాలలో పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్.హరీష్ జిల్లా అధికారులను ఆదేశించా రు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ హరీష్, అదనపు కలెక్టర్ ప్రతీక్ జైన్‌తో కలిసి 'మన ఊరు - మనబడి' పనులపై, దళితబంధు, పోషణ అభియాన్‌పై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సం దర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టా త్మకంగా చేపట్టిన 'మన ఊరు- మన బడి' కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో మోడల్ పాఠశాలలు అభివృద్ధి పను లు, కాంపౌండ్ వాల్స్, మరుగుదొడ్లు, కలరింగ్, డైనింగ్ హాల్, గార్డెనింగ్, విద్యుత్, బ్లాక్ బోర్డ్స్, తదితర (12) రకాల పనులను చేపట్టినట్టు తెలిపారు. పిల్లలు ఆహ్లాదకరమైన వాతావరణంలో చదువుకోవడానికి ఈ పథకాన్ని ప్రభు త్వం ప్రవేశపెట్టిందన్నారు. జిల్లాలో మొదటి విడతలో 464 పాఠశాలలు ఎంపిక చేశామన్నారు. ఇందులో 54 మోడల్ పాఠశాలలో 32 పూర్తి అయినవి, మిగిలిన 22 పాఠశాలలో పనులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. 410 పాఠశాలలోని సివిల్ పనులు, ఇతర అభివృద్ధి పను లు పూర్తి చేయుటకు చర్యలు తీసుకోవాలని సంబంధిత ఇంజనీరింగ్ అధికారులను విద్యాశాఖ అధికారిని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో ఉన్న అంగన్వాడీ కేంద్రాల్లో నీటి సదుపాయం, మరుగుదొడ్ల ఏర్పాటులు తప్పకుండా చేప ట్టాలని అధికారులకు సూచించారు. గర్భిణుల్లో, పిల్లలలో రక్తహీనత తగ్గించేందుకు సంబంధిత అధికారులు కృషి చేయాలనీ ఆదేశించారు. అంగన్వాడీ సెంటర్లలో నూట్రి గార్డులను ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. బరువు, ఎత్తు కొలిచే సాధనాలను ఉపయోగించి పిల్లల బరువు, ఎత్తు కొలవాలని, సామ్, మామ్ పిల్లలు ఎంత మంది ఉన్నారో సెంటర్ వారీగా నివేదిక తయారు చేయాలని సూచించా రు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ ప్రతీక్‌జైన్, జి ల్లా విద్యాశాఖ అధికారి సుశీందర్ రావు, జిల్లా ఎస్సీ కార్పొ రేషన్ అధికారి ప్రవీణ్‌రెడ్డి, జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ శాఖ అధికారి మోతి, ఈఈ పీఆర్, సంబంధిత ఇంజనీరింగ్, విద్యాశాఖ అధికారులు, సంబంధిత శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.