Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నర్సింగ్ గురుకులంలో కేంద్రం ఏర్పాటు
- కేంద్రానికి గంట ముందే రావాలి
- నార్సింగ్ ప్రిన్సిపాల్ కృపావరం
నవతెలంగాణ-గండిపేట్
ఈ నెల 26న సైనిక్ స్కూల్ 2003-2004 ఎంట్రన్స్ పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్టు నార్సింగ్ గురుకుల స్కూల్ ప్రిన్సిపాల్ కృపావరం అన్నారు. శుక్రవారం ఆమె మాట్లాడుతూ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠ శాల సైనిక్ కామన్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ ఆరవ తరగతి, 11వ తరగతికి సం బంధించిన ఎంట్రెన్స్ ఎగ్జామ్ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న భాగంలో వెస్ట్ జోన్ రంగారెడ్డి నార్సింగ్ నందు పరీక్షా కేంద్రాన్ని పూర్తి ఏర్పాట్లు చేశామ న్నారు. రుక్మాపూర్ కరీంనగర్ సాంఘిక సంక్షేమ గురు కుల పాఠశాలలో చేరేందుకు అవకాశం ఉందన్నారు. విద్యార్థులు దరఖాస్తులు చేసుకున్న వారం దరూ సంబంధించిన హాల్ టికెట్లను అందుబాటులో ఉంచామన్నారు. ఆన్ లైన్లో హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకునే అవకాశం కల్పించామన్నారు. ఉన్న తాధికారుల ఆదేశాల మేరకు పరీక్షను ప్రశాంతంగా నిర్వ హించేందుకు ఏర్పా ట్లు చేశామన్నారు. పరీక్షా కేంద్రానికి విద్యార్థులు గంట ముందే రావాలన్నారు. బ్లూ అండ్ బ్లాక్ పెన్ ఆధార్‌కార్డ్ వాటర్ బాటిల్ హాల్ టికెట్‌ను మీ వెంట తప్పనిసరి తీసుకురావాలన్నారు. నార్సింగ్‌లో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రానికి రావడానికి మెహిదీపట్నం నుంచి 123 రైతు బజార్ వద్ద బస్సు ఎక్కితే పరీక్ష కేంద్రం ముందు దిగొచ్చని సూచించారు. ఈ అవకాశాన్ని విద్యార్థుల తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.