Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కొడుకు మృతిపై తల్లి అనుమానం
నవతెలంగాణ - కుల్కచర్ల
కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహ త్య చేసుకున్న సంఘటన కుల్కచర్ల మండలం మూజహిద్ పూర్ గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. కుల్కచర్ల ఎస్ఐ గిరి తెలిపిన వివరాల ప్రకారం రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌కు చెందిన క్షీర సాగర తారభాయి కొడుకు విజయభాస్కర్(39)కు మూజహిద్ పూర్ గ్రామానికి చెందిన బోడికే నర్సుబాయితో కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. అతను ఇళ్లరికం వచ్చాడు. వీరికి ఇద్దరు కొడుకులు ఉన్నారు. కాగా కొంతకాలంగా తరుచూ దంపతులు గొడవపడేవారు. దీంతో మనస్థాపానికి గురైన విజయభాస్కర్ శుక్రవారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబీకులు వచ్చి చూసే సరికి విజయభాస్కర్ మృతి చెంది ఉన్నాడు. తన కొడుకు మృతిపై అనుమానం ఉందని మృతుడి తల్లి క్షిరసాగర తారబాయి తెలిపింది. కుల్కచర్ల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాపు ్తచేస్తున్నామని ఎస్ఐ గిరి తెలిపారు.