Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు అమలు చేయాలి
- ఎన్పీఆర్డీ జిల్లా అధ్యక్షులు దశరథ
నవతెలంగాణ-కుల్కచర్ల
రాష్ట్ర బడ్జెట్లో వికలాంగుల సంక్షేమానికి 5 శాతం ని ధులు కేటాయించాలని విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు అమ లు చేయాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక జిల్లా అధ్యక్షుడు దశరథ్ డిమాండ్ చేశారు. శుక్రవారం మండల కేంద్రంలో వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఆవిర్భావ దినోత్సవాన్ని మండలాధ్యక్షుడు శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించి జెండా ఆవిష్కరించారు. ఈ సంద ర్భంగా పలువురు మాట్లాడుతూ...వికలాంగుల ఆత్మగౌరవ సాధన కోసం వికలాంగులపై జరుగుతున్న దాడులు దౌర్జ న్యాలు లైంగికదాడులను అరికట్టాలని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వికలాంగులపై చూపుతున్న చిన్నచూపును విరమించుకోవాలన్నారు. డబుల్ బెడ్రూం లో వికలాంగులకు 5 శాతం వాటా కేటాయించి ఇండ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్చేశారు. వికలాంగుల సమస్య ల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వికలాంగులకు అనేక రకాల సౌకర్యాలు కల్పించి వారికి ఉపాధి కల్పించాలన్నారు. కార్యక్రమంలో ఎన్.వెం కట్ రాములు, వెంకటయ్య, ఎన్.బిచ్చయ్య, అంజి, అం జనేయులు, శ్రీను, సత్యం, రమేష్, నందు, శంకర్, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.