Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కనీస వేతనాలు రూ.26వేలు ఇవ్వాలి
- సీఐటీయూ జిల్లా అధ్యక్షులు మహిపాల్
నవతెలంగాణ-వికారాబాద్ ప్రతినిధి
గ్రామపంచాయతీ కార్మికులకు పెండింగ్ వేతనాలు ఇవ్వాలని, కనీస వేతనాలు రూ.26వేల రూపాయలు ఇవ్వా లని సీఐటీయూ జిల్లా అధ్యక్షులు మహిపాల్ డిమాం డ్ చేశారు. శుక్రవారం సీఐటీయూ కార్యాలయం నుంచి కలెక్ట రట్ వరకు బైక్ ర్యాలీ, పాదయాత్ర నిర్వహించారు. కలె క్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. అనంతరం సబ్ కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలన్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కార్మికులకు వేతనాలు పెంచాలన్నారు. మల్టీ పర్పస్ విధానం రద్దు చేయాలన్నారు. ప్రమాద బీమా రూ.15 లక్షలు ఇవ్వాలని, గుర్తింపు కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అర్హులకు డబుల్ బెడ్రూం ఇండ్లు ఇవ్వా లన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా నాయకులు, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు ఎం.సుదర్శన్, గిరిజన సం ఘం జిల్లా అధ్యక్షుడు శ్రీనునాయక్, పంచాయతీ కార్మికులు నాయకులు బోనయ్య, అశోక్, రాజు, మహేందర్, యాద య్య, గోపాల్, తిరుమలేశా, కుమార్, మహేందర్, శేఖర్, పోచయ్య, సంతోష్, విజరు, అషం అదివయ్య, వెంకట్, ప్రభు, నర్సింలు, వెంకటయ్య రాములమ్మ, చంద్రమ్మ, శ్రీశై లం, రము, బాబు, శివ అంజిలయ్య దుర్గయ్య పాల్గొన్నారు.