Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తలకొండపల్లి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమం గ్రామాల్లో పకడ్భందీగా నిర్వహిస్తున్నట్టు సర్పంచ్ ధ్యాసమోని చంద్రయ్య అన్నారు. శుక్రవారం చౌదర్పల్లి గ్రామంలో 7రోజులుగా నిర్వహిస్తున్న కంటి వెలుగు కార్యక్రమం శుక్రవారం ముగిసింది. ఈ ముగింపు కార్యక్రమంలో భాగంగా ముఖ్య అతిథి హాజరై సర్పంచ్ ధ్యాస మోని చంద్రయ్య , వైద్యులు, వైద్య సిబ్బందిని ఆశా వర్కర్లును ఘనంగా శాలువలతో సత్కరించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ కంటి వెలుగు కార్యక్రమంలో వృద్ధులకు, నిరుపేదలకు పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి అద్దాలు పంపిణీ చేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు మల్లికార్జున, మల్లయ్య, శివ,రవి, మల్లేశ్వరి, ఏఎన్ఎం సువర్ణ, ఆశావర్కర్లు మాధవి, కవిత, సరస్వతి, శారద, జయమ్మ తదితరులు పాల్గొన్నారు.