Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ కార్మికశాఖ కమిషనర్ డాక్టర్ గంగాధర్
- సెక్యూరిటీ ట్రైనింగ్ సెంటర్ ప్రారంభం
నవతెలంగాణ-షాబాద్
ప్రయివేట్ భద్రత కోసంసెక్యూరిటీలను నియమించుకోవాలని తెలంగాణ కార్మికశాఖ కమిషనర్ డాక్టర్ ఈ.ఎల్. గంగాధర్ అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని కక్కులూర్ రెవెన్యూ పరిధిలో ఎజైల్ సెక్యూరిటీ ఫోర్స్ ట్రైనింగ్ అకాడమీ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ఎంఈపీఎస్సీ మేనేజర్ అభిషేక్ సక్సేనా, ఇన్స్పెక్టర్ గురువయ్యగౌడ్, సెక్యూరిటీ ట్రైనింగ్ సెంటర్ చైర్మన్ భాస్కర్‌రెడ్డి, వ్యవస్థాపకులు డాక్టర్ వీఆర్‌కె రావులతో సెక్యూరిటీ సెంటర్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఆత్యాధునిక మౌలిక సదుపాయాలు, పరికరాలతో కూడిన ఎజైల్ సెక్యూరిటీ ఫోర్స్ ట్రైనింగ్ అకాడమీ ఔత్సాహిక అభ్యర్థులకు శారీరక,వృతి పరమైన, ఉద్యోగ శిక్షణను అందించడానికి ఉపయోగపడుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎజైల్ సెక్యూరిటీ ఫోర్స్ ట్రైనింగ్ అకాడమీ సిబ్బంది తదితరులు ఉన్నారు.