Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతు సంఘం జిల్లా ప్రధాన కార్మిదర్శి ప్రభులింగం
నవతెలంగాణ-శంకర్పల్లి
ధరణిలో ఉన్న భూమిని రికార్డుల సవరణ సాధా బైనాముల ద్వారా, పట్టాదారులకు పాస్ పుస్తకాలు ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రభులింగం అన్నారు. తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం పిలుపు మేరకు 24, 25 తేదీల్లో మండల కేంద్రా ల్లో శుక్రవారం శంకర్పల్లి మండల కేంద్రంలోని తహసీ ల్దార్ కార్యాలయం ఎదుట సీపీఐ మండల కార్యదర్శి సుధీర్ అధ్యక్షతన ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై, తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం కౌన్సిల్ సభ్యులు మాల్గాని సుధాకర్ గౌడ్‌తో కలసి, ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన పిలుపు భాగంగా మండలంలోని అన్ని తహసీల్దార్ కార్యాలయం సమీపంలో దగ్గర ధరణిలో ఉన్న భూమిని రికార్డుల సవ రణ సాదా బైనామాల ద్వారా పట్టాదారులకు పాస్ పుస్త కాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో రైతు రుణమాఫీ, పంట మాఫీ చేయా లన్నారు. అలాగే 50 ఏండ్ల పైబడిన రైతలుకు రూ.5 వేల పింఛన్ ఇవ్వాలని కోరారు. పొద్దుటూరు గ్రామంలో సర్వేనెంబర్ 240, 241లో ఉన్న 24 ఎకరాలు 50 మంది దళిత రైతులు 70 ఏండ్లుగా కాసు చేస్తున్న వారందరికీ పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బయన్న గడ్డలో కట్టిన డబుల్ బెడ్రూం ఇండ్లు, ఇండ్లులేని నిరుపేదలకు ఇవ్వాలని కోరారు. ఈ నెల 27వ తేదీన ధరణి సమ స్యలపై జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టనున్నట్టు తెలిపారు.ఈ ధర్నాకు రైతులందరూ అధిక సంఖ్యలో తరలిరావలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ సీనియర్ నాయకులు ఎండి షాబుద్దీన్, రైతు సంఘం నాయకులు జిల్లా ఉపాధ్యక్షులు నాని చంద్రయ్య, రైతు సంఘం నాయకులు గోపాల్‌రెడ్డి, పరమయ్య, యాదయ్య గౌడ్, మహిళా రైతు సంఘం నాయకులు చిలుకమ్మ, అన్నపూర్ణ మాధవి రైతులు గంగయ్య, అంజయ్య, బుచ్చయ్య, నాని సాయిలు, బి. వెంకటయ్య, రైతులు పాల్గొన్నారు.