Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దళితబంధు, డబుల్ బెడ్రూం ఇండ్లు
- మొదటి ప్రాధాన్యతతో ఇవ్వాలి
- గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్
- అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు పాండు, వెంకటయ్య
నవతెలంగాణ-మంచాల
మున్సిపల్ కార్మికులకు ఇస్తున్న జీవో 60 ప్రకారం, గ్రామ పంచాయతీ కార్మికులకు వేతనాలు ఇవ్వాలని గ్రామ పంచాయితీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు గ్యార పాండు, చాగింటి వెంకటయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం మండల పరిధిలోని రంగాపూర్ గ్రామంలో మూడోవ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూని యన్ పాదయాత్ర చేపట్టింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నో పోరాటాల ఫలితంగా ప్రభుత్వం రూ.8500 వేతనాలు పెంచిందన్నారు. పెంచిన వేతనాలు 2011 జనాభా లెక్కల ప్రకారం 500 మంది జనాభా ఒక్క కార్మికుడిని నియమించాలని ప్రభుత్వం ఈ జీవో తీసుకొచ్చిందన్నారు. ముఖ్యంగా 2021 జనాభా లెక్కల ప్రకారం వేతనాలు అందజేసి, 250 మంది జనాభాకు ఒక్క కార్మికుడినీ నియమించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మల్టీ పర్పస్ విధానాన్ని అమలు చేయడం వల్ల గ్రామ పంచాయతీ ఉద్యోగ, కార్మికులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. గ్రామ పంచాయతీ ఉద్యోగ, కార్మికుల్లో 80 శాతం మంది దళితులే ఉన్నందున మొదట దళితబంధు, డబుల్ బెడ్రూం ఇండ్లు మొదట పంచాయతీ కార్మికులకే ఇవ్వాలని కోరారు. ఈ ఆంశాలపై 28న ఇందిరా పార్కు వద్ద నిర్వహించే బహిరంగ సభకు కార్మికులందరూ అధిక సంఖ్యలో తరలిరావాలని పిలుపు నిచ్చారు.ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు డి.జగదీష్, సీఐటీయూ మండల కన్వీనర్ పోచమోనీ కృష్ణ, రైతు సంఘం జిల్లా నాయకులు కె.శ్రీనివాస్ రెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు డబ్బీకార్ అజరు బాస్, ఐద్వా సంఘం నాయకులు, స్థానిక సర్పంచ్ డబ్బీకార్ మమత అజరు బాస్, మాజీ సర్పంచ్లు నేనావత్ బాలకృష్ణ, నాయకులు చందునాయక్, యూనియన్ నాయకులు మేడిపల్లి అంజయ్య, నవీన్, పాపయ్య, అనిత తదితరులు పాల్గొన్నారు.