Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-యాచారం
కంటి వెలుగు పథకం పేదలకు వరం లాంటిదని సర్పంచ్ ఎండి హబీబుద్దిన్ అన్నారు. శుక్రవారం యాచారం మండల పరిధిలోని కొత్తపల్లిలో కంటి వెలుగు సెంటర్ను ఆయన ప్రారంభించారు. అనంతరం కంటి సమస్యలపై వచ్చిన వారందరికీ పరీక్షలు నిర్వహించి కండ్ల అద్దాలు అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడా అమలు కావడం లేదన్నారు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న కంటి వెలుగు పథకాన్ని పేద ప్రజలందరూ ఉపయోగించుకోవాలని కోరారు. గడ్డం మల్లయ్య గూడ, కొత్తపల్లి సెంటర్ల ద్వారా 255 మందికి కంటి పరీక్షలు నిర్వహించి, 55 మందికి కండ్ల అద్దాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ కావలి జగన్, సెక్రెటరీ వేణు, మెడికల్ ఆఫీసర్స్ రాజలక్ష్మి, ప్రియాంక, మౌనిక, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.