Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దోమ
అవినీతి బీఆర్ఎస్ను సాగనంపాలని కార్నర్ మీటిం గ్లో ధ్వజమెత్తిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కారణం ప్రహ్లాద్‌రావు, జిల్లా అధ్యక్షులు సదానంద రెడ్డి మిట్ట పరమేశ్వర్ రెడ్డి అన్నారు. మండల పరిధిలోని దొంగ ఎంకెపల్లి, మైలారంలో ప్రజాగోస-బీజేపీ భరోసాశక్తి కేంద్రం కార్నర్ మీటింగ్ శక్తి కేంద్రం ఇన్చార్జీ సతీనారా యణచారి ఆధ్వర్యంలో నిర్వహించారు. సమావేశానికి ముఖ్యఅతిథులుగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గసభ్యులు కారణం ప్రహ్లద్‌రావు, జిల్లా అధ్యక్షులు సదానంద రెడ్డి, మిట్ట పరమేశ్వర్ రెడ్డి హాజరయ్యారు. పలువురు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేదలకు డబుల్ బెడ్ రూములు ఇంతవరకు ఇవ్వలేదు. ఇంటికొక ఉద్యోగం, దళితులకు మూ డెకరాల భూమి, రైతులకు లక్ష రూపాయల రుణ మాఫీ ప్రజలకు హామీలు ఇచ్చి నెరవేర్చకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం విఫల మైందన్నారు. కేంద్ర ప్రభుత్వం పథకాలు కరపత్రాలు ఇంటింటికి చేరవేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మండల అధ్యక్షులు శేరి రాంరెడ్డి,జిల్లా కార్యదర్శి కేశవులు, హరికృష్ణ, అసెంబ్లీ కానీన్వర్ నర్సి ములు, దోమ మండల్ ఇన్చార్జ్ పెంటయ్య, కిష్టారెడ్డి, ఆంజనేయులు, గోపాల్, నాగేంద్ర, నర్సిములు, మొగు లయ్య, బీరప్ప, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.