Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పాఠశాల కోఆప్షన్ సభ్యులు దరువుల శంకర్
నవతెలంగాణ-తలకొండపల్లి
మండలం విద్యార్థులు చిన్నతనం నుండే ఉన్నతమైన లక్ష్యాలను ఎంపిక చేసుకుని లక్ష్యఛేదన దిశలో ముందుకు సాగాలని పాఠశాల కోఆప్షన్ సభ్యులు దరువుల శంకర్ విద్యార్థులకు పిలుపునిచ్చారు. శనివారం మెదక్ పల్లిలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో స్వయం పరిపాలన దినో త్సవాన్ని విద్యార్థులు ఉపాధ్యాయులు ఘనంగా నిర్వహిం చారు. విద్యార్థులు అలంకరణ దుస్తులతో ముస్తాబై తోటి విద్యార్థులకు చక్కగా పాఠాలు బోధించారు. నూతనంగా డీఈఓ రక్షిత్, డిప్యూటీ డీఈఓ శివప్రసాద్, ఎంఈఓ వర్షిక, హెచ్ఎంగా చందన, మరో29 మంది ఉపాధ్యాయు లుగా విద్యార్థులు వ్యవహరించారని విద్యార్థులను పాఠశాల ఉపాధ్యాయులు గ్రామ పెద్దలు అభినందిం చారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమ తులను పాఠశాల ప్రధానోపాధ్యాయులు కే.శ్రీనివాస్, ఉపాధ్యాయులు రమేష్‌రెడ్డి, శోభారాణి అందజేశారు. కార్యక్రమంలో పాఠశాల కోఆప్షన్ సభ్యులు దరువుల శంకర్, తిరుమణి విష్ణు గౌడ్, విద్యార్థుల స్వాతి, మేఘన, శివానంద్, నవ్యశ్రీ, లోహిత, అక్షిత, తల్లిదండ్రులు గ్రామ స్తులు పాల్గొన్నారు.