Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాంగ్రెస్ మండల సీనియర్ నాయకులు డోకూరు ప్రభాకర్ రెడ్డి,కాంగ్రెస్ నాయకులు సర్పంచ్ కాడేమోని శ్రీశైలం
నవతెలంగాణ-తలకొండపల్లి
మండలం కాంగ్రెస్తోనే మారుమూల గ్రామాల అభివృద్ధి చెందుతాయని కాంగ్రెస్ మండల సీనియర్ నాయకులు డోకూరు ప్రభాకర్ రెడ్డి అన్నారు. శనివారం వెంకటాపూర్ రోడ్డు శిథిల వ్యవస్థతో ఉన్న రాకపోకలకు వాహనాలకు ఇబ్బంది. ఉండడంతో తానున్నానంటూ ముందుకొచ్చిన కాంగ్రెస్ మండల సీనియర్ నాయకులు డోకూరు ప్రభాకర్ రెడ్డి, వెంకటాపూర్ చౌరస్తా నుండి పడకల్ వరకు కాంగ్రెస్ మండల సీనియర్ నాయకులు డోకూరు ప్రభాకర్ రెడ్డి, సహకారంతో పడకల్ నుండి దేవునిపడకల్, పెద్దూరు తండా వరకు ప్రజల కోరిక మేరకు మట్టి రోడ్డు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రారంభించారు. అనంతరంలి పడకల్లో బూరెల సాయమ్మ అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందింది. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ నాయకులు బూరెల నరసమ్మ కుటుంబానికి కాంగ్రెస్ ఆధ్వర్యంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు ప్రభాకర్ రెడ్డి సహకారంతో రూ.3 వేల ఆర్థిక సాయం అందజేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సర్పంచ్ కాడేమోని శ్రీశైలం, అసెంబ్లీ సోషల్ మీడియా ఇన్చార్జీ అజీమ్, అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ కార్యదర్శి రవీందర్ యాదవ్, మండల యువజన కాంగ్రెస్ నాయకులు సత్యం, తిరుపతి, ప్రవీణ్, శంకర్, రమేష్, భిక్షపతి, శ్రీను, కృష్ణ, బావోజి, చంద్రు నాయక్, భాస్కర్ పాల్గొన్నారు.