Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దళిత ప్రజాసంఘాల ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తా నుంచి ర్యాలీ
- ఆర్డీవోకు వినతి పత్రాన్ని అందజేసిన దళిత ప్రజాసంఘాల నాయకులు
నవతెలంగాణ-తాండూరు
పోలీస్ స్టేషన్‌పై దళిత యువకునిపై దాడి చేసిన శివ స్వాములను వెంటనే అరెస్టు చేయాలని కోరుతూ శని వారం తాండూర్ పట్టణ కేంద్రంలో దళిత ప్రజాసంఘాల ఆధ్వర్యంలో భారీర్యాలీ కార్యక్రమాలు నిర్వహించారు. దళిత ప్రజాసంఘాల ఆధ్వర్యంలో తాండూర్ పట్టణంలో అంబేద్కర్ విగ్రహం నుండి ఆర్డీవో ఆఫీస్ వరకు ర్యాలీగా వెళ్లి కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి ఆర్డీవో కు వినతిపత్రం అందజేశారు. ధర్నాను ఉద్దేశించి పలుపురు దళిత ప్రజాసంఘాల నాయకులు మాట్లాడుతూ.. యా లాల పోలీస్ స్టేషన్‌పై, దళిత యువకుడు మెట్లి నరేషపై దాడి చేసిన దాదాపు 200 మంది శివస్వాములని అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజరు, పోలీస్ స్టేషన్‌పై దాడికి సహకారం చేసిన బీజేపీ నాయకుడు మురళీకృష్ణ గౌడ్‌ను పరామర్శించడానికి వచ్చి యాలాల మండలం లోని దళిత యువకునిపై దాడి చేసి, పోలీస్ స్టేషన్ దాడి దళిత యువకుడిపై దాసిన ఘటనపై మాట్లాడకుండా దాడిని ఖండించకుండా తాండూర్‌లో ప్రెస్ మీట్లో శివస్వాములను రెచ్చ గొట్టి దాడికి సహకారం చేసిన మురళీ గౌడ్‌ను పరామర్శించడం దూర్మార్గమని హెచ్చరించారు.
యాలాల మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్ పై దా డి, దళిత యువకుడు నరేష్ పై దాడి చేసిన మిగిలిన 200 మంది నిందితులను అరెస్ట్ చేయాలన్నారు. కార్యక్రమంలో దళిత ప్రజాసంఘాల నాయకులు జిల్లాఅధ్యక్షులు ఉప్పలి మల్కయ్య, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు శ్రీనివాస్, బు స్సా చంద్రయ్య, ఎస్సీ, ఎసీ,్ట బీసీ మైనార్టీ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు కొత్తూరు చంద్రయ్య, కేఎన్పీఎస్ నాయకులు రత్నం, యు.రమేష్ అంబేద్కర్ యువజన సంఘం తాలూకా అధ్యక్షులు, రవీందర్ తెలంగాణ రిజ ర్వషన్ రజక సంఘం అధ్యక్షులు, జిల్లా వ్యకాసంఘం జిల్లా అధ్యక్షులు యు.బుగ్గప్ప, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్, తాండూర్ ఏఎంసీ డైరెక్టర్ మెట్లి ఆశన్న, డివిజన్ నాయకులు కోళ్ల గోపాల్, మొగుళప్ప, నర్సిములు, దళిత యువకులు మెట్లి కృష్ణ, జిల్లా నాయకు లు గుమ్మడిరత్నం, జిల్లా నాయకులు వెంకటయ్య, కిష్టప్ప, చిన్న కృష్ణ బాణా అధ్యక్షులు నారాయణ పేట జిల్లా, నర్సి ము లు తాండూర్ మండలాధ్యక్షులు, ప్రభుదాస్ మద్దూర్, కృష్ణ నాయకులు, విజయకుమార్, రాములు పాల్గొన్నారు.