Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పరిగి
ఈ శ్రామ్ జిల్లా కమిటీలో జన్ సహస్ సంస్థకు చోటు దక్కిందని జిల్లా కో ఆర్డినేటర్ ప్రకాష్ కుమార్ తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ నూతనంగా ఏర్పాటు చేసిన ఈ శ్రామ్ జిల్లా స్థాయి అమలు కమిటీలో జన్ సహస్ స్వచ్ఛంధ సంస్థకు అవకాశం దక్కింది పేర్కొన్నారు. అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం ఈ శ్రామ్ కార్డు అమలు చేస్తుంది. ఈ శ్రామ్ నమోదు, పర్యవేక్షణ కోసం జిల్లాలో కొత్తగా కమిటీ ఏర్పాటు చేశారని తెలిపారు. ఈ కమిటీకి జిల్లా కలెక్టర్ ఛైర్మెన్‌గా కొనసాగుతారు. అ సిస్టెంట్ లేబర్ కమి షనర్ సెక్రటరీగా, డీఆర్డిఏ పీడీ, జెడ్పీ సీఈఓ, ఎంపీడీ ఓలు, మున్సిపల్ కమిషనర్లు, ఇతర శాఖల అధికారులు, జన్ సహస్ స్వచ్ఛంధ సంస్థ జిల్లా కో ఆర్డినేటర్ ప్రకాష్ కుమార్ సభ్యులుగా ఉంటారని వివరించారు. కార్మికశాఖ సహ కారం, ఆయాశాఖల సంబంధించిన అధికారులతో సమిష్టి కృషితో గ్రామాల్లో పూర్తి స్థాయిలో ఈ శ్రామ్ అమలుకు కృషి చేస్తామని తెలిపారు. సంస్థకు జిల్లా స్థాయి లో అవకాశం కల్పించడం పట్ల అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.