Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాటేదాన్ క్లస్టర్ కన్వీనర్ రుద్రకుమార్
నవతెలంగాణ- రాజేంద్రనగర్
కాటేదాన్ పారిశ్రామిక ప్రాంతంలో పనిచేసే కార్మి కులకు సీఐటీయూ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, కార్మి కుల సమస్యల పరిష్కారానికి రాజీలేని పోరాటం చేస్తామ ని కాటేదాన్ క్లస్టర్ కన్వీనర్ రుద్రకుమార్ అన్నారు. కాటే దాన్ పూజ ప్లాస్టిక్‌లో పనిచేస్తే కార్మికురాలు సునీతా దేవి గత కొంతకాలం క్రితం వేతనాలు యాజమాన్యం సరిగా ఇవ్వడం లేదని కాటేదాన్ క్లస్టర్ కమిటీ దృష్టికి తీసుకొని వెళ్ళింది. దీనిపై వెంటనే స్పందించిన కస్టర్ కన్వీనర్ రుద్ర కుమార్, కోశాధికారి భాస్కర్ కంపెనీ యాజమాన్యంతో చర్చించి సునీతా దేవికి వేతనంతో పాటు ఇతర బెనిఫిట్స్ అందజేశారు. రుద్రకుమార్ మాట్లాడుతూ కాటేదాన్ పారి శ్రామిక ప్రాంతాల్లో ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చిన కార్మికులు ఎక్కువగా పని చేస్తున్నారు. కంపెనీ యాజమాన్యులు వీరి చేత వెట్టి చాకిరి చేయించుకొని కనీ స వేతనాలు కూడా ఇవ్వడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికులకు గుర్తింపు కార్డు ఈఎస్ఐ, పిఎఫ్ వంటి కనీసం సౌకర్యాలు కూడా కల్పించడం లేదని ఆయ న ఆందోళన వ్యక్తం చేశారు. పరిశ్రమంలో కార్మికులకు ఎలాంటి అన్యాయం జరిగినా వెంటనే సీఐటీయూ దృష్టికి తీసుకొని వస్తే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.