Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'కంపు కొడుతున్న పరిగి ఆర్టీసీ బస్టాండ్' కథనానికి కదిలిన అధికారులు
- బస్టాండ్ శుభ్రం, చదును చేయించిన అధికారులు
నవతెలంగాణ-పరిగి
పరిగి పట్టణ కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్‌లో బహి రంగ మూత్ర విసర్జన, మురుగునీటి గుంటలు, పందుల స్వైర విహారంతో 'కంపు కొడుతున్న పరిగి ఆర్టీసీ బస్టాండ్' అని శనివారం నవతెలంగాణ పత్రికలో కథనం ప్రచురి తమైంది. దాంతో ఆర్టీసీ డీఎం జి. ఎన్ పవిత్ర, ఈఈ( సివిల్ ) బిఆర్ సింగ్ వెంటనే స్పందించారు. శనివారం బస్టాండ్‌ను సందర్శించారు. బస్టాండ్ ఆవరణ అంతా శుభ్రం చేయించారు. అనంతరం మురికి నీటి గుంతలలో మట్టి పోసి చదును చేయించారు. డీఎం వెంటనే స్పందించి బస్టాండ్ పరిసరాలను శుభ్రం చేయించడంతో ప్రయాణి కులు హర్షం వ్యక్తం చేశారు.
ప్రయాణికుల కోసం అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాం : డీఎం
ఈ సందర్భంగా ఆర్టీసీ డీఎం జి.ఎన్ పవిత్ర మాట్లా డుతూ ఆర్టీసీ బస్టాండ్ కాం పౌండ్ వాల్‌కు సమీపంలోని వాటర్ ట్యాంక్ నుంచి వృథా నీరు ఆర్టీసీ బస్టాండ్‌లోకి వచ్చి, బస్ డిపోలో కూడా వస్తు న్నాయని తెలిపారు. వృథా నీరు బస్టాండ్ లోనికి రాకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని కమిష నర్కు ఫిర్యాదు కూడా చేశామన్నారు. శనివారం బస్టాండ్ ప్రాంగణం మొత్తం శుభ్రం చేయించినట్టు తెలిపారు. నీరు నిలిచిన గుంతలలో మట్టి కూడా పోయించి చదును చేయించామని వివరించారు. బస్టాండ్‌లో ఫ్రీ టాయిలెట్లు ఉన్నాయని, ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని సూచించారు. బహిరంగ మూత్ర విసర్జన చేయకుండా అవగాహన కూడా కల్పిస్తామన్నారు. బస్టాండ్ లో వాటర్ కూలర్ ఏర్పాటు చేసి వేసవి కాలంలో ప్రయాణికులకు చల్లనీరు అందించేందుకు కృషి చేస్తున్నా మన్నారు. ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది కలగకుం డా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. ఆర్టీసీ ప్రయాణం ప్రజలకు ఎంతో సురక్షితం అన్నారు. ఆర్టీసీని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.