Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి
- సబ్బండ వర్గాలకు సంక్షేమ ఫలాలు
- ఆదిభట్ల మున్సిపల్ చేరిన ప్రగతి పాదయాత్ర
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
ఎడారిగా దర్శనమిచ్చే ఇబ్రహీంపట్నం పెద్ద చెరువు నేడు పుష్కలంగా నీరు చేరడంతో గోదా వరిని తలపిస్తుందని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. ఈ చెరువులో టూరిస్ట్ హబ్‌గా తీర్చిదిద్దుతామని అన్నారు. తన తనయుడు మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్‌రెడ్డి చేపట్టిన ప్రగతి నివేదన పాదయాత్ర బహిరంగ సభ శుక్రవారం రోజు రాత్రి శేరిగూడ గ్రామంలో నిర్వహించారు. శనివారం ఉదయం ఆదిభట్ల మున్సిపల్ పరిధిలోని రాందా స్పల్లిలో నిర్విహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు సబండ వర్గాలకు అందాయని గుర్తుకు చేశారు. బొంగులూరు ఓఆర్ఆర్ నుండి ఇబ్రహీంపట్నం వరకు బిటి రోడ్డు రెన్యువల్ కోసం రూ.4.56 కోట్లతో డబుల్ రోడ్డు నిర్మాణం జరిగిందన్నారు. సెంటర్ లైటింగ్ కోసం బొంగులూరు నుంచి ఇబ్రహీంపట్నం వరకు రూ. 4.84 కోట్లతో రోడ్డు సుందరీకరణ చేశామన్నారు. శేరిగూడ గ్రామంలో సీసీరోడ్లు, డ్రయినేజీ వ్యవస్థకు రూ 99 లక్షలు, 'మన ఊరు-మన గ్రామం' కార్యక్రమం ద్వారా రూ.12 లక్షలు, ఉన్నత పాఠశాల అభివృద్ధికి రూ.42లక్షలు కేటా యించామన్నారు. గ్రామంలో పింఛన్లకు 238 మందికి రూ 4.98లక్షలు, రైతుబంధు పథకం ద్వారా 496 మంది రైతులకు రూ.33.94 లక్షలు, రైతుబీమా పథకంతో 9 మంది రైతులకు రూ.45 లక్షలు, మిషన్ భగీరథ తాగు నీటికి రూ.14.70 కోట్లు ఖర్చు చేశామన్నారు. శేరిగూ డలో రూ.36.67 కోట్లతో అభివృద్ధి చేశామన్నా రు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు క్యామ మల్లేష్, ఎంపీపీ కృపేశ్, ఏఎంసీ చైర్మన్ చంద్రయ్య, వైస్ చైర్మన్ ఆకుల యాదగిరి, బీఆర్ఎస్ మున్సిపల్ అధ్యక్షుడు అల్వాల వెంకటరెడ్డి, కార్యదర్శి మడుపు వేణుగోపాల్, కౌన్సిలర్లు సర్పంచులు, ఎంపీటీసీలు, బీఆర్ఎస్ నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు రాజు, కార్యకర్తలు బంటి యూత్ ఫోర్స్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
ఆదిభట్ల మున్సిపల్‌కి చేరిన ప్రగతి యాత్ర
బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్‌రెడ్డి చేపట్టిన ప్రగతి నివేదన పాదయాత్ర శని వారం ఆదిభట్ల మున్సిపాలిటీకి చేరుకుంది. మున్సిపల్ పరి ధిలోని రాందాస్‌పల్లి గ్రామంలో గడపగడపకూ తిరుగు తూ యాత్ర కొనసాగింది. రాందాస్‌పల్లి గ్రామంలో రూ. 27.02 లక్షలు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు.