Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 5 గురు వ్యక్తుల ఆరెస్టు, ముగ్గురు పరారీ
- భూ యాజమానుల ఆన్లైన్ సెర్చ్‌తో బయటపడ్డ బాగోతం
- నిందితుల నుంచి నగదు, సెల్పోన్లు, ల్యాప్‌ట్యాప్ స్వాధీనం
- వివరాలు వెల్లడించిన మహేశ్వరం ఏసీపీ సి. అంజయ్య
నవతెలంగాణ-కందుకూరు
బతికి ఉన్న భూ యాజమానులు చనిపోయినట్లుగా నకిలీపత్రాలను సృష్టించి 16 ఎకరాల 01 గుంట భూమిని అమ్మిసోమ్ము చేసుకుంటున్న వ్యక్తులు కటకటాలపాలయ్యా రు. ఈ ఘటన కందుకూరు పోలీస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. శనివారం మహేశ్వరం ఏసీపీ సి. అంజయ్య, సీఐ కృష్ణంరాజులు విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. కందుకూరు మండల పరిధిలోని మురళీన గర్ గ్రామ రెవెన్యూ లో 11, 12,13,14,15,16,17 సర్వే నెంబర్లలో 32 ఎకరాల 04 గుంటలు కలదు. అందులో 19 ఎకరాల 20 గుంటలు వీరారెడ్డి, 06 ఎకరాల 07 గుం టలు పోలేమోని రాఘవులు, 05 ఎకరాల 04 గుంటలు పిట్టల జంగయ్య , 01 ఎకరం 03 గుంటలు అంబటి జం గయ్యల పేరున ఉన్నభూమి 2018 సంవత్సరంలో చక్రహరి హర్షవర్తన్, దేవిలు ఆయుర్వేద మెడికల్ ఇన్సిట్యూ ట్ పేరున కోనుగోలు చేశారు. కందుకూరు మండలం ధ న్నారం గ్రామానికి చెందిన చుక్క శ్రీకాంత్‌గౌడ్ అదే గ్రా మానికి చెందిన పిట్టల జంగయ్య 05 ఎకరాల 04 గుం టల భూమిని 2021లో కోనుగోలు చేశారు. భూమి అమ్మి న కోన్ని రోజులకే పిట్టల జంగయ్య చనిపోవడానికి కారణం శ్రీకాంత్గౌడ్యేనని పెద్దల సమక్షంలో నీలదీయగా శ్రీకాంత్‌గౌడ్ 03 ఎకరాల 20 గుంటల భూమిని పిట్టల జంగయ్య భార్య అయిన పిట్టల అంజమ్మ పేరున రిజిస్ట్రేషన్ చేశారు. శ్రీకాంత్‌గౌడ్ తాను కోల్పోయిన భూ మిని తిరిగి స్వాధీనం చేసుకోవాలనే పథకంతో కందుకూరు మండలం గూడూరు గ్రామానికి చెందిన నర్ల రాములు, మహే శ్వరం మండలం తుమ్మలూరు గ్రామానికి చెందిన శ్రీశైలం రియల్టర్లు పాత పరిచయంతో మండల కేంద్రంలో ఆన్లైన్ సేవలు నిర్వహించే ప్రవీణ్, మహేష్, వినోద్‌లు కూటమిగా ఏర్పడ్డారు. భూ యాజమానులైన హర్షవర్థన్, దేవి కరోనా సమయంలో చనిపోయినట్టు గాంధీ ఆస్పత్రి నుంచి నకిలీ డేత్ సర్టిఫికేట్లు, ఆధార్ కార్డులు సృష్టించారు. ఇటివల 16 ఎకరాల 01 గుంట భూమిని శ్రీకాంత్‌గౌడ్ బీ ఎన్ రెడ్డికి చెందిన జగన్మోహన్రెడ్డికి 05 ఎకరాల 04 గుం టలు, కనకాల వెంకట్రామ్రెడ్డి, ఉపేందర్‌రెడ్డి, శృతి, దోంతుల సుభాష్‌రెడ్డితో పాటు ఇతరుల పేరుపై 07 ఎక రాల 06 గుంటల భూమిని ఎకరాకు 24 లక్షల చోప్పున అమ్మేశారు. ఇటివల కాలంలో భూ యాజమానులైన హర్ష వర్థన్, దేవిలు తన భూమిని ఆన్లైన్లో చూసేసరికి తన పేరున ఉన్న భూమి కనిపించకపోవడంతో అనుమానం వ్యక్తమై ఈ ఏడాది జనవరి 20న కందుకూరు పోలీసుస్టే షన్లో ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు 5 మంది నిందితులను ఆరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. శ్రీకాంత్‌గౌడ్ నుంచి రూ.5 లక్షల నగదు, రూ.18 లక్షల చెక్కు, నర్ల రాములు నుంచి రూ.45 వేలు, మహేష్, ప్రవీణ్‌ల నుంచి ల్యాప్‌ట్యాప్, ప్రింటర్స్, 5 సెల్పోన్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో సీఐ శ్రావణ్‌కుమార్, కొండల్, విజయ్, వెంకట్, తదితరులు పాల్గొన్నారు.