Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్
- శ్రీ దత్త ఇంజనీరింగ్ కళాశాలలో ముగిసిన 2వ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్
- యువ శాస్త్రవేత్తలకు బహుమతుల ప్రదానం
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
దేశానికి సేవ చేసే యువ శాస్త్రవేత్తలు ఎంతో అవసర మని ప్రొఫెసర్ గాలి వినోద్‌కుమార్ అన్నారు. ఇబ్ర హీంపట్నం సమీపంలోని శ్రీ దత్త ఇంజినీరింగ్ విద్యా సంస్థల్లో మూడు రోజులుగా రెండవ ఇంటర్నేషనల్ కాన్పరెన్స్ ప్రోగ్రాం ముగిసింది. ఈ ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచానికి ఉపయోగపడే వి ధంగా శాస్త్రవేత్తలు ఎదగాలని ఆకాంక్షించారు. రీసెర్స్ దేశ అభివృద్ధికి దోహదపడుతుందని అన్నారు. ఈ తరుణంలో పలు రంగాల్లో శాస్త్రవేత్తలు రాణిం చాల్సిన అవసరం ఉం దని గుర్తు చేశారు. అలాంటి రీసెర్చ్ కాలర్స్‌ను తయారు చేయడంలో శ్రీ దత్త ఇంజనీరింగ్ విద్యాసంస్థలు కృషి చే యాలని సూచించారు. శ్రీ దత్త విద్యాసంస్థల చైర్మన్ పాండురంగారెడ్డి మాట్లాడుతూ.. శ్రీ దత్త విద్యా సంస్థల్లో ఇన్నోవేషన్ ప్రయోగాలతో శ్రీదత్త ఇంజనీరింగ్ విద్యా సంస్థలు మొదటి సంవత్సరం నుండి రీసెర్చ్ ఇన్నోవేషన్ మీద ట్రైనింగ్ ఇచ్చామన్నారు. దీని వలన విద్యార్థుల ఆలోచన, మేధస్సు పెరుగుతుందని తెలిపారు. వైస్ చైర్మన్ విభవ్రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థులకు ప్రోత్సహిస్తూ యు వ పరిశోధకులకు బహుమతి ప్రదానం చేశారు. ఈ కార్య క్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్స్ శ్రీనివాస్, సెంథిల్ కుమార్, శ్రీనివాసరావు, హెచ్ఓడీలు వెంకటేశ్వరు,్ల జావిద్, అచ్యుతరావు, శ్రీనివాస్ వర్మ, యశ్వంత్‌రెడ్డి, సందీప్‌రెడ్డి, నాగమల్లేశ్వరరావు, తదితరులు ఉన్నారు.