Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీ అధికారంలోకి రాకుండా అడ్డుకుంటాం
- ప్రజా సమస్యలపై సమరశీల పోరాటాలు
- ప్రభుత్వరంగాన్ని తెగనమ్ముతున్న మోడీ సర్కార్
- మార్చి 15 నుంచి 30 వరకు క్షేత్రస్థాయిలో నిరసన
- సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జాన్‌వెస్లీ
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
ఫెడరల్ వ్యవస్థకు మోడీ ప్రభుత్వం తూట్లు పొడు స్తుందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జాన్ వెస్లీ అన్నారు. కేంద్రంలో మరోసారి బీజేపీని అధికారంలోకి రాకుండా అడ్డుకుంటామన్నారు. ప్రజా సమస్యల పరి ష్కారం కోసం మార్చి 15 నుంచి 30 వరకు క్షేత్రస్థాయి నిరసనలు, ఉద్యమాలు ఉదతం చేస్తామని హెచ్చరించారు. సీపీఐ(ఎం) జిల్లా కమిటీ, పూర్తిస్థాయి కార్యకర్తల సమావేశం ఇబ్రహీంపట్నంలోని పాషా, నరహరి స్మారక కేంద్రంలో శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడారు.. ప్రభుత్వ రంగ సంస్థలను మోడీ ప్రభుత్వం తెగ నమ్ముతోందని మండిపడ్డారు. ప్రస్తుతం అదానీ ఆస్తులపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుందని చెప్పారు. మూడు లక్షల కోట్ల ఆదాయమున్న అదానీ, మోడీ సహాకారంతో ప్రపం చంలోనే కుబేరుల జాబితాలో రెండో స్థానంలో నిలిచాడని గుర్తు చేశారు. ప్రస్తుతం 19లక్షల కోట్ల ఆదాయం అదానీ ఖాతాలో చేరిందన్నారు. 40శాతం రుణాలు ఎస్బీఐ బ్యాం కుల ద్వారా రుణాలు తీసుకున్నాడన్నారు. రూ.45లక్షల కోట్లకు చేరిందని గుర్తు చేశారు. కోట్లాది వ్యవసాయ కార్మి కులకు రూ.2లక్షల కోట్ల నిధులు కేటాయించాల్సి ఉంటే, కేంద్ర ప్రభుత్వం కేవలం రూ.60 వేల కోట్లు మాత్రమే కేటాయించడం సిగ్గు చేటన్నారు. కార్పొరేట్లకు రూ.14లక్షల కోట్లు లాభం చేకూర్చే విధంగా బడ్జెట్ కేటాయింపులున్నా యన్నారు. 50శాతం మంది పేదలు ఒక పూట తిండి లేక అలమటించే పరిస్థితి ఏర్పడిందన్నారు. మోడీ ప్రభుత్వ కాలంలో 9శాతం నిరుద్యోగం పెరిగిందని గుర్తు చేశారు. ప్రభుత్వరంగ సంస్థలైన ఎల్ఐసీ, రైల్వే, ఎయిర్‌ఫోర్టు, స్టీల్‌ప్లాంట్‌ను ప్రయివేటు పరం చేస్తుందని మండిపడ్డారు. వెనుకబడిన తరగతులకు రూ.45లక్షల కోట్లు కేటాయించా ల్సి ఉంటే, కేవలం రూ.2వేల కోట్లు కేటాయించి చేతులు దులుపుకుందన్నారు. మార్చి 15-30 వరకు నిరసన కా ర్యక్రమాలు చేపట్టను న్నామన్నారు. మత ఘర్షణలతో బీ జేపీ నాయకులు ప్రజలను రెచ్చగొడుతున్నారన్నారు. ప్రజా సమస్యలు చర్చకు రానియ్యడం లేదన్నారు. ఈ కార్యక్రమం లో జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బి.సామెల్, పియాదయ్య, మధుసూదన్‌రెడ్డి, జగదీష్, జిల్లా కమిటీ సభ్యులు సీహెచ్ జంగయ్య, ఆలంపల్లి నరసింహ, ఈ.నర్సింహ, శ్యాంసుందర్, కే.జగన్, అంజయ్య, తదితరులు ఉన్నారు.
జిల్లాలో లక్షా97వేల మంది ఇండ్ల కోసం దరఖాస్తులు : సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి కాడిగళ్ల భాస్కర్
జిల్లాలో ఇండ్లు లేని పేదలు 1,97,000 మంది దర ఖాస్తు చేసుకున్నారని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి కాడిగళ్ల భాస్కర్ అన్నారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని 16,144మంది పేదలు ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకు న్నట్టు వివరించారు. కానీ 235 డబుల్ బెడ్రూం ఇండ్ల పనులు ప్రారంభించినట్టు చెప్పారు. రంగారెడ్డి జిల్లాలో 17వేల ఎకరాల ప్రభుత్వ భూములు కబ్జాకు గురైనట్టు ప్ర భుత్వ అధికారులు గుర్తించారని చెప్పారు. వీటిలో 14వేల ఎకరాలు వ్యవసాయ భూములు కాగా, 4వేల ఎకరాల భూములు ఇండ్ల స్థలాలకు కేటాయించినవన్నారు. 317 జీవో కింద రంగారెడ్డి జిల్లాకు చెందిన అనేక మంది ఉద్యో గులను ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్ వంటి ప్రాంతాలకు బదిలీ చేశారని, కానీ ఉపాధ్యాయుల బదిలీ ప్రక్రీయ ప్రారం భం కాకుండానే రంగారెడ్డి జిల్లాకు 120 మంది ఉపాధ్యా యులు అక్రమార్గంలో ఎలా వచ్చారని ప్రశ్నించారు. జిల్లాకు చెందిన విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి ఎందుకు అక్రమ బదిలీలను ఆపడం లేదని ప్రశ్నించారు. ఫార్మా పేరుతో 19 ఎకరాల భూములను తీసుకుంటే ఆర్డీవో, ఎంఆర్ఓ, ప్ర భుత్వ పెద్దలు కుమ్మక్కై ఎలాంటి భూమి లేని వ్యక్తులకు కూడా నష్టపరిహారం అందజేసి కోట్లాది రూపాయలను కా జేశారని మండిపడ్డారు. జిల్లాలో 1,95,749 డ్వాక్రా సంఘాలు ఉంటే, వీటిలో కేవలం 86వేల గ్రూపులకు మా త్రమే బ్యాంకు రుణాలు అందజేశారన్నారు. మిగతా లక్షా 70వేల గ్రూపులకు ఎందుకు రుణాలు జారీ చేయడం లే దని ప్రశ్నించారు. ఈ ప్రాంతంలో 2007లో ప్రభుత్వమే ఇండ్ల స్థలాలు సర్టిఫికెట్లు జారీ చేసినందున లబ్ధిదారులను ఇండ్లు నిర్మించుకోకుండా అడ్డుకుంటుందన్నారు.