Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బలవంతపు భూసేకరణ వెంటనే ఆపాలి
- ఫార్మాసిటీ వ్యతిరేక కమిటీ ఉపాధ్యక్షుడు కానమోని గణేష్
నవతెలంగాణ-యాచారం
ఫార్మా పేరుతో రైతుల హక్కులను రాష్ట్ర ప్రభుత్వం హరిస్తుందని ఫార్మాసిటీ వ్యతిరేక కమిటీ ఉపాధ్యక్షుడు కాన మోని గణేష్ అన్నారు. శనివారం ఆయన మాట్లా డుతూ ఫార్మా పేరుతో బలవంతపు భూసేకరణ వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు. ఫార్మా బాధిత రైతులపై కక్షపూ రితంగా అధికారులు, ప్రభుత్వం పక్షపూరితంగా వ్యవహరి స్తుందని ఆరోపించారు. బాధిత రైతుల పేర్లను ధరణిలో తొలగిం చడం బాధాకరమైన విషయమని అన్నారు. వెంటనే రైతుల పేర్లను ధరణిలో ఎక్కించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇష్టం లేకుండా అవార్డు పాస్ చేయొ ద్దని హెచ్చరిం చారు. ప్రభుత్వం రైతులను మానసికంగా వేధిస్తుం దని ఆరోపించారు. బాధిత రైతులకు అన్యాయం జరిగితే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వానికి రైతుల భూములను లాక్కునే హక్కు ఎవరిచ్చారని ప్రశ్నించారు. విషపూరిత కంపెనీని వెంటనే రద్దుచేసి రైతులకు న్యాయం చేయాలని కోరారు. ఫార్మా పేరుతో తొలగించిన రైతు పేర్లను వెంటనే ధరణిలో ఎక్కించి రైతుబీమా, రైతుబంధు, బ్యాంకుల్లో ఇచ్చే క్రాఫ్ లోన్లు అందేలా చూడాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.