Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి
నవతెలంగాణ-తలకొండపల్లి
మండలం ఏ రాష్ట్రంలో లేని విధంగా రాష్ట్రంలో కేసీ ఆర్ నిరుపేదలను ఆదుకోవడానికి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినట్లు ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. శనివారం గట్టిఇప్పలపల్లికి చెందిన అంజయ్య, సునీతక, అంతారంకి చెందిన వెంకటయ్యకు సీఎం సహాయనిధి నుండి ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి సహకారంతో మంజూరయ్యయి. లబ్దిదారులైన అంజయ్య రూ.6 వేలు, సునీతకు రూ.15 వేలు, అంతారంకి చెందిన సిహెచ్ వెంకటయ్యకు రూ.60 వేలు అందజేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు రేణురెడ్డి, టీ.రాజేందర్, సురేందర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.