Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గుర్రం చెన్న కేశవరెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలి
- పీఆర్టీయూ టీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీరెల్లి కమలాకర్
నవతెలంగాణ-వికారాబాద్ డెస్క్
ఉపాధ్యాయుల సమస్యల పట్ల ప్రశ్నించే గొంతుకు మొదటి ప్రాధాన్యతా ఓటు వేసి గెలిపించాలని పీఆర్టీయూ టీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీరెల్లి కమలాకర్ పిలుపుని చ్చారు. శనివారం పెద్దేముల్ మండలంలో పరిధిలోని కందనెల్లి జిల్లా పరిషత్ పాఠశాల, మంబాపూర్ జిల్లా పరిషత్ పాఠశాల, మారేపల్లి కస్తూర్బా గురుకుల పాఠశాల, ఇందూర్ జిల్లా పరిషత్ పాఠశాల, ఉర్దూ జిల్లా పరిషత్ పాఠశాల, పెద్దేముల్ జిల్లా పరిషత్ పాఠశాలలో హైదరా బాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారాన్ని పీఆర్టీయూ టీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిరెల్లి కమలాకర్, జిల్లా ప్రధాన కార్యదర్శి అమర్ నాథ్ ఎమ్మెల్సీ అభ్యర్థి గుర్రం చెన్నకే శవ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ప్రచారం నిర్వహిం చారు. అనంతరం పెద్దేముల్ జిల్లా పరిషత్ బాలుర పాఠశాలలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లా డారు. ఉపాధ్యాయుల సంక్షేమమే పిఆర్టియు లక్ష్యంగా పోరాడుతుందని అన్నారు. 317 జీవో వలన ఇబ్బంది పడ్డ ఉపాధ్యాయులను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి, వారి వారి జిల్లాలకు పంపించే విధంగా, బాధ్యత తీసుకొని కృషి చేస్తా మని వివరించారు. ఉపాధ్యాయుల సమస్యల పట్ల నిరంత రం పోరాటం చేసి, సమస్యలను పరిష్కరించే విధంగా తమ సంఘం కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పీఆర్టీయూ మండల శాఖ అధ్యక్షులు రాజశేఖర్, మండల ప్రధాన కార్యదర్శి నవీన్‌కుమార్, రాష్ట్ర బాధ్యులు, జిల్లా బాధ్యులు, మండల బాధ్యులు ఉపాధ్యాయులు ద్యావరి నరేందర్‌రెడ్డి, వెంకట్ రెడ్డి, శాంతప్ప, మల్లప్ప శ్రీనివాస్‌రెడ్డి, అంజయ్య, రవి కాంత్‌రెడ్డి, నరసింహులు, బందప్ప, ఆనంద్, గోబ్రా నాయక్, మండల కార్యవర్గ బాధ్యులు, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.