Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- కందుకూరు
కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ ఆధ్వర్యంలో కందుకూరు మండలం నేదునూ రు గ్రామంలో శనివారం మోడల్ స్కూల్ విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణ కోసం, జామ, అరటి, వేప, నిమ్మ, మామిడి, కరివేపాకు మొదలైన 1500 రకల మొక్కలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నేదునూర్ గ్రామ సర్పంచ్ కాసుల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ భవిషత్ తరాలకు మంచి వాతావరణం ఇవ్వాలని కోరారు. విరివిగా మొక్కలను నాటి పర్యావరణ కాలుష్యం రాకుండా కాపాడాల్సిన బాధ్యత మనందరి పై బాధ్యత ఉందన్నారు. కంపెనీ వైస్ ప్రెసిడెంట్ మొహ్మద్ ఉస్మాన్ మాట్లాడుతూ సుస్థిర వాతావరణ పరిరక్షణ జరగాలంటే మొక్కలు నాటి వాటిని సంరక్షించడం ద్వారా మాత్రమే జరుగుతుందన్నారు. అది విద్యార్థుల ద్వారా మాత్రమే సాధ్యం అవుతుందని తెలిపారు. సీజీఆర్ సంస్థ డైరెక్టర్, ప్రక్యత పర్యావరణ శాస్త్రవేత్త డాక్టర్ నక్క సాయి భాస్కర్‌రెడ్డి మాట్లాడారు. స్వచ్ఛంద సంస్థలు విచ్చేసి విద్యార్దులకు పర్యావరణ చైతన్యాన్ని కల్పించి ప్రతీ ఒక్క విద్యార్థికి రెండు మొక్కల చొప్పున పంపిణీ చేశారు. విద్యార్ధుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఎర్త్ సెంటర్ కాన్సెప్ట్‌నీ రాష్ట్రంలో మొదటగా తమ మోడల్ స్కూల్లో నిర్వహించినందుకు ధన్యవాదాలు తెలియచేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ శ్రీధర్, వైస్ ప్రిన్సిపాల్ మొహిద్దీన్ డాక్టర్ ఉమ మహేశ్వర్‌రెడ్డి, ప్రముక పర్యావరణ శాస్త్రవేత్త, గుడ్ల రజనీకాంత్, సంస్థ ప్రతినిధులు వంశీ కృష్ణ, వహీదా 60 మందితో కూడిన బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.