Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మొబైల్ ఓటీపీలు, పిన్ నెంబర్లు ఇతరులకు చెప్పవద్దు
- షీటీం ఇన్చార్జీ సబ్ ఇన్సెపెక్టర్ ప్రమీల
నవతెలంగాణ -వికారాబాద్ కలెక్టరేట్
కొత్తగడి, వికారాబాద్ సాంఘిక సంక్షేమ పాఠశాల విద్యార్థినులకు శని వారం సైబర్ నేరాలపై ప్రజలు అవగాహన ఉండాలని వికారాబాద్ జిల్లా ఎస్పీ ఎన్. కోటిరెడ్డి పిలుపు మేరకు పోలీసుశాఖ వారి ఆధ్వర్యంలో సైబర్ నేరాలపై విద్యార్థినులకు శిక్షణ ఇచ్చారు. అందులో భాగంగా శనివారం కొత్తగడి, వికారా బాద్ పరిధిలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల, కళాశాల విద్యార్థినులు ప్రజలకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. పాఠశాల నుండి కొత్తగడి బస్టాప్ వరకు విద్యార్థినులు మెంటర్ టీచర్లు స్రవం తి, తేజశ్వి అధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. సైబర్ నేరాలతో ఎంతోమంది మోసపోతున్నారని అలాంటి మోసాలకు గురి కావద్దని ఫ్లాష్ మాబ్ ద్వారా చక్కగా ప్రజలకు వివరించారు. మొబైల్ ఓటీపీలు,పిన్ నెంబర్లు ఇతరులకు చెప్పవద్దని ఈ కార్యక్రమం ద్వారా అవగాహన కల్పించారు. సైబర్ నేరాలపై అవగాహన కల్పించడం సామాజిక బాధ్యతగా గుర్తించి కార్యక్రమం నిర్వహిం చినందుకు కొత్తగడి గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. షీ టీం ఇన్చార్జీ ఎస్ఐ ప్రమీల విద్యార్థినులను అభినందించారు. కార్యక్రమంలో పాఠశాల,కళాశాల ప్రిన్సిపల్ పి.అపర్ణ, వైస్ ప్రిన్సిపల్స్, స్టాఫ్ మెంబర్స్, షీటీం ప్రతినిధి శ్రీనయ్య, విద్యార్థినులు పాల్గొన్నారు.