Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు కలెక్టర్ నారాయణరెడ్డి
- మండలం పీరంపల్లి గ్రామ అంగన్వాడీ టీచర్ సస్పెండ్
- పాఠశాల, అంగన్వాడీలో నాణ్యమైన భోజనం అందించాలి
- భోజన నాణ్యతా పర్యవేక్షణ లోపంతో ఉపాధ్యాయురాలికి మెమో
నవతెలంగాణ-కుల్కచర్ల
పల్లె ప్రగతిలో చేపట్టిన ప్రతి పది రోజుల్లో పూర్తి చేయాలని, విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డి హెచ్చరిం చారు. శనివారం మండలం పీ రంపల్లిలో ట్రైనీ కలెక్టర్ సంచిత్ గంగ్వార్‌తో కలిసి ఆకస్మిక తనిఖీ లు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో పల్లె ప్రగతి కింద చేపట్టిన పల్లె ప్రకృతివనం, శ్మశానవాటిక, నర్సరీ, డంపింగ్ యార్డ్‌లను ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ కేంద్రాలను సందర్శించి వంటశాల గదిని, పిల్లలకు వడ్డించే భోజనం నాణ్యతను కలెక్టర్ పరిశీలించారు. అంగన్‌వ్వాడీ కేంద్రంలో పిల్లలకు, బాలింతలకు భోజనం, గుడ్లు, బాలామృతం సరిగ్గా ఇవ్వడం లేద ని గ్రామస్తులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేయగా.. దీనిపై స్పందించిన జిల్లా కలెక్టర్ రిజిస్టర్లను తనిఖీ చేసి అంగన్వాడీ టీచర్ విధి నిర్వహణలో నిర్లక్ష్యాన్ని గ్రహించిన కలెక్టర్ అంగన్వాడీ టీచర్ వెంకటమ్మను సస్పెండ్ చేశారు. ప్రాథమిక పాఠశాలలో భోజనం నాణ్యతలో లోపాన్ని గుర్తించిన కలెక్టర్ పర్యవేక్షణలో పం కారణంగా ఉపాధ్యాయురాలికీ మెమో జారీ చేశారు. ఇకమీదట పునరావృతమైతే చర్యలు తప్ప వని మండల విద్యాధికారిని, కలెక్టర్ హెచ్చ రించా రు. పల్లెప్రగతిలో భాగంగా నిర్వహిస్తున్న నర్సరీ, శ్మశానవాటిక,, డంపింగ్ యార్డ్, పల్లె ప్రకృతి వనాన్ని క్షేత్ర స్థాయిలో కలెక్టర్ పరిశీలించారు. పల్లె ప్రకృతి వనంలో చేపట్టే పనులపై కలెక్టర్ అధికారు లను ఉద్దేశించి మాట్లాడుతూ..పల్లె ప్రగతిలో చేపట్టే లక్ష్యాలను అన్ని వాడుకలోకి వచ్చే విధం గా చర్యలు తీసుకోవాలని ఆదేశిం చారు. ప్రకృతి వనాన్ని వాడుక లోకి తీసుకురావ డమే కాకుం డా ఎప్పుడు పచ్చగా ఉండే లా చర్యలు తీసుకో వాల న్నారు. వాచర్లు (వన సం రక్షకులు) సక్రమంగా పనిచే యినట్లైతే కొత్తవారిని నియ మించుకోవాలని కలెక్టర్ ఎంపీడీవోకు సూచించారు. డంపింగ్ యార్డులలో తడి,పొడి చెత్తను ఎప్పటికప్పుడు వేరే చేసుకో వాలని కంపోస్ షెడ్డులో ఎరువులను తయారు చేసుకునేలా చర్యలు చేపట్టాలన్నారు. నర్సరీలోని ఇంకా ఏపుగా పెరిగేలా చర్యలు తీసుకుంటూ వచ్చే హరితహారానికి వినియోగించుకునేలా సిద్ధం చేయా లని అధికారులను ఆదేశించారు. పది రోజు ల్లో పల్లె ప్రగతి పనులను పూర్తి చేసి వాడకల్లోకి తీసుకురా నట్ల యితే మండల అధికారులతో పాటు సంబం ధిత అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరిం చారు.
శిశువుకు జన్మనిచ్చిన తల్లికి పునర్జన్మే
గర్భం దాల్చినప్పటి నుండి మొదలుకుని శిశువుకు జన్మనిచ్చేంత వరకు గర్భిణులకు సేవలం దించాలని ఆశా వర్కర్, ఏఎన్ఎంలకు కలెక్టర్ సూ చించారు. శిశువుకు జన్మనివ్వడం పునర్జన్మేనని అలాంటి తల్లికి అంగన్వాడీ, ఆశా వర్కర్లు ఎప్పటి కప్పుడు వారి బాగోగులను తెలుసుకుంటూ ఉండా లని కలెక్టర్ తెలిపారు. గర్భం దాల్చినప్పటి నుండి మొదలుకుని డెలివరీ అయిన 6 నెలల వరకు గుడ్లు, బాలామృతం అందించాలని తెలిపారు.
డెలివరీ అయిన తల్లులకు ఫోన్ చేసి మాట్లాడిన కలెక్టర్
డెలివరీ అయిన తల్లులకు ఫోన్ చేసి వారి బాగోవులను అడిగి తెలుసుకున్నారు. అంగన్వాడీ నుంచి అందాల్సిన గుడ్లు, బాలామృతంపై ఆరా తీశా రు. ఆరోగ్యం పట్ల అన్ని జాగ్రత్తలు తీసుకుని క్షేమం గా ఉండాలని సూచించారు.
ఉపాధ్యాయులు పిల్లల పట్ల బాధ్యతాయుతంగా ఉండాలి
ఉపాధ్యాయులు పిల్లలకు చదువుతోపాటు ప్రతీ విషయంలోను అవగాహన ఉండేలా తీర్చిదిద్దాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ రాధిక సోమ లింగం, ఎంపీడీవో నాగవేణి, తహసీల్దార్ రమేష్, పలు శాఖల అధికారులు, ఎంపీవో కరీం, ఏపీవో వెంకటేష్, ఫీల్డ్ అసిస్టెంట్, రైతుబంధు మండలా ధ్యక్షుడు పీరంపల్లి రాజు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.