Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పబ్లిక్ వాయిస్ ఫోరం జిల్లా అధ్యక్షుడు పడిగల అశోక్
నవతెలంగాణ-వికారాబాద్ కలెక్టరేట్
వికారాబాద్ మున్సిపాలిటీ పరిధిలో శనివారం వీధి కుక్కల నుంచి ప్రజలకు రక్షణ కల్పించాలని వీధి కుక్కలను అరికట్టాలని పబ్లిక్ వాయిస్ ఫోరం ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ శరత్చంద్రకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పబ్లిక్ వాయిస్ఫోరం జిల్లా అధ్యక్షులు పి. అశోక్ మాట్లాడుతూ వికారాబాద్ పట్టణంలో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయని వృద్ధులు, చిన్న పిల్లల ప్రాణా లకు ప్రమాదంగా ఉందని గతంలో వికారాబాద్ శివరెడ్డి పేటలో అలంపల్లిలో జరిగిన ఘటనలు, గత వారంలో హై దరాబాద్లో జరిగిన ఘటనలు వికారాబాద్లో పునరావృ తం కాకుండా మున్సిపల్ సిబ్బంది చర్యలు తీసుకో వాల ని డిమాండ్ చేశారు. కమిషనర్ మాట్లాడుతూ తగిన చర్య లు చేపడతామని హామీ ఇచ్చారని తెలిపారు. కార్యక్రమం లో జిల్లా ఉపాధ్యక్షులు ఏ శేఖర్, పట్టణ అధ్యక్షులు శ్రావణ్ కుమార్, సలహాదారులు వై.నర్సింలు, రాజు, తేజ పాల్గొన్నారు.