Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆత్మ గౌరవం, హక్కులకు ఉద్యమించాలి
- జిల్లా అధ్యక్షులు దశరథ్
నవతెలంగాణ-దోమ
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వికలాంగుల సంక్షేమం పట్ల నిర్ల్యక్షం చేస్తున్నాయని, నామినేటెడ్ పదవుల్లో వికలాంగులకు రిజర్వేషన్స్ అమలుచేయాలని, ఆత్మ గౌర వం, హక్కుల సాధన కోసం వికలాంగులు ఐక్య ఉద్యమా లకు సిద్ధం కావాలని ఎన్పిఆర్డి రాష్ట్ర కార్యదర్శులు ఏం. అడివయ్య పిలుపు నిచ్చారు. ఎన్పిఆర్డి 13వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణ చేసి తదనంత రం 13 సంవత్సరాల ప్రస్థానంపై జిల్లా సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2010 ఫిబ్రవరి 21-22 తేదీల్లో ఆత్మ గౌరవం, హక్కుల సాధన లక్ష్యాలతో ఏర్పడి దేశ వ్యాపితంగా ఉద్యమాలు చేస్తుందన్నారు. హక్కుల పరిరక్షణకు వికలాంగులను ఐక్యం చేస్తుందన్నా రు. 28వతేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా సంఘం ఆవిర్భావ దినోత్సవ వారోత్సవాలు జరుపుతున్నామరు. 28న రాష్ట్ర సదస్సు నిర్వహిస్తు న్నామని తెలిపారు. గడిచిన 13 ఏండ్ల కాలంలో వికలాంగుల సంక్షేమం కోసం పాలకుల విధానా లపై ఉద్యమాలు చేసి విజయాలు సాధించిన చరిత్ర సంఘానికి ఉందన్నారు. 2016ఆర్పిడి చట్టం ఆర్సీఐ, మానసిక వికలాంగుల చట్టం వంటి వాటిని అమలు చే యాలని డిమాండ్ చేశారు. రైల్వేలో సౌకర్యాల కోసం ఉద్య మాలు ఉదృతం చేస్తామని తెలిపారు. వికలాంగులకు చేయూత నివ్వడంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని బ్యాక్‌లాక్ పోస్టుల భర్తీ కోసం ఉద్యమాలు చేస్తున్నావ ున్నారు. మహిళా వికలాంగులకు రక్షణ లేకుండా పోతోం దని మహిళా వికలాంగులపై లైంగికదాడులు జరుగుతున్న ఎందుకు పట్టించుకోవడం లేదన్నారు. రాష్ట్రంలో 20 లక్షల మంది వికలాంగులు ఉన్న రాని వారి కుటుంబల సంక్షే మం బాధ్యత ప్రభుత్వానికి లేదా అని నిరుద్యోగ యువతకు శిక్షణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ధరల పెరుగుదలకు అనుగుణంగా వికలాంగుల పెన్షన్ రూ.10 వేలు పెంచా లని డిమాండ్ చేశారు. సామూహిక ప్రాంతాలన్నీ మార్చ డంలో ప్రభుత్వాలు విఫలం చెందుతున్నాయని విమ ర్శిం చారు. రాష్ట్ర ప్రభుత్వం వికలాంగుల సంక్షేమం కోసం అనే క చర్యలు తీసుకుంటున్నప్పటికీ అవేవీ వికలాంగులకు దక్కడంలేదని విమర్శించారు. వికలాంగుల ఉద్యోగులకు ప్రమోషన్లు రిజర్వేషన్లు అమలు చేయడం లేదని రోస్టర్ పాయింట్లలో వికలాంగులకు 10లోపు మార్చాలని డిమాం డ్ చేశారు. కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగ నియామ కల్లో వికలాంగులకు 4 శాతం రిజర్వేషన్లు ఎందుకు అమ లు చేయడం లేదని ప్రశ్నించారు. నామినే టెడ్ పోస్టుల్లో వికలాంగులకు రిజర్వేషన్ సౌకర్యం కల్పించాలని డిమాం డ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు జె దశరథ్, కార్యదర్శి ఆర్శంకర్, కే సావిత్రమ్మ, రాష్ట్ర కమిటీ సభ్యురా లు కే.అంజనేయులు, జిల్లా కమిటీ ఆఫీస్ బేరర్, బి శ్రీనివాస్, ఐ.గోపాల్, కే శంకర్, ఎండి సలీం, ఏ గణేష్, అనంతలక్ష్మి, నందు, వి మురారి పాల్గొన్నారు.