Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- చేవెళ్ల
చేవెళ్ల మండల కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి జన్మదిన వేడుకలు పార్టీ నాయకులతో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ...రాబోయే ఎన్ని కల్లో రాష్ట్రంలో అధికారం బీజేపీదేనని అందుకు పార్టీ శ్రమ లు కార్యకర్తలు నిరంతరం కృషి చేయాలన్నారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాల గురించి ప్రజ లకు వివరించి పార్టీ శ్రమలకు సూచించారు. రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్న మోసాలు, స్కీములు, పథకాలు అన్నిటిని ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఈ వచ్చే ఎన్నికల్లో ప్రజలు కేసీఆర్ ప్రభుత్వానికి చరమగీతం పాడే పరిస్థితి ఉందన్నారు. ట్రస్ట్ ద్వారా ప్రభువా స్కూల్లో చదువుతున్న పేదా విద్యార్ధులకు చేయూతనిచ్చి ప్రోత్సాహకరంగా 18 మంది విద్యార్థులకు ప్రతి ఒక విద్యాధికి రూ.1500-27 000 చెక్కులను అందజేసారు. బీజేపీ రాష్ట్ర నాయకులు కంజర్ల ప్రకాష్, బీజేపీ నాయకులు వరి తులసి రామ్ విజ రు కుమార్, చేవెళ్ల అసెంబ్లీ కన్వీనర్ ప్రతాపరెడ్డి,చేవెళ్ల మండలాధ్యక్షులు దేవర పాండురంగారెడ్డి, మండల ప్రధా న కార్యదర్శి అనంతరెడ్డి, దళిత మోర్చా మండల అధ్యక్షు లు అశోక్, చేవెళ్ల బీజేవైఎం అసెంబ్లీ కన్వీనర్ అల్లాడ శ్రీనివాస్ రెడ్డి, శంకర్పల్లి మండలాధ్యక్షులు రాములు గౌడ్, శంకర్పల్లి మున్సిపాలిటీ అధ్యక్షులు సురేష్, జిల్లా నాయ కులు రంగారెడ్డి జిల్లా కార్యవర్గ సభ్యులు నితీష్ రెడ్డి, మం డల ఓబీసీ ఉపాధ్యక్షులు కుమార్ గౌడ్, బీజేవైఎం మం డలాధ్యక్షులు పత్తి సత్యనారాయణ, బీజేవైఎం టౌన్ అధ్య క్షులు బండారి శేఖర్ రెడ్డి, బీజేపీ పట్టణ అధ్యక్షులు శ్రీనివా స్ రెడ్డి, బీజేపీ మండల ఉపాధ్యక్షులు శెర్వలింగం, కేశపల్లి వెంకటరామిరెడ్డి, జి.వెంకట్ రెడ్డి, కృష్ణ గౌడ్ ముడిమాల శక్తి కేంద్రం ఇన్చార్జ్ మహేందర్ గౌడ్, బీజేవైఎం జాయిం ట్ సెక్రెటరీ మహేశ్వర్ రెడ్డి, జిల్లా నాయకులు కుంచం శ్రీనివాస్, బీజేవైఎం జాయింట్ సెక్రెటరీ కరుణాకర్ రెడ్డి, బీజేపీ నాయకులు ఆలూరు కృష్ణ, చాకలి శ్రీనివాస్, బీజేవై ఎం ప్రధాన కార్యదర్శి భాస్కర్, మధుకర్ రెడ్డి, ఐటీ సెల్ అధ్యక్షులు అభిషేక్ రెడ్డి, నవీన్ రెడ్డి పాల్గొన్నారు.