Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, మాజీ బీసీ కమిషన్ సభ్యులు తల్లోజీ ఆచారి
నవతెలంగాణ-తలకొండపల్లి
మండలం ప్రజల సమస్యలు ప్రస్తావనకు రాకుండా బీఆర్ఎస్ విపక్షాలు గొంతు నొక్కుతుందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, మాజీ బీసీ కమిషన్ సభ్యులు తల్లోజీ ఆచారి అన్నారు. శనివారం రాత్రి మండలం వెల్జాల్ గ్రామపంచాయతీ ముందల బీజేపీ మండలాధ్యక్షుడు తిరుమణి రవిగౌడ్ అధ్యక్షతన పల్లెగోస బీజేపీ భరోసా కార్నర్ సమావేశం నిర్వహించారు. బీజేపీ మాజీ బీసీ కమిషనర్ సభ్యులు తల్లోజి ఆచారి ఆధ్వర్యంలో అధ్యక్షతన నిర్వహించిన సమావేశానికి ముఖ్యఅతిథిగా బీజేపీ జా తీయ మహిళా ఉపాధ్యక్షురాలు డీకే.అరుణ హాజరయ్యారు. ఈ సందర్భంగా డీకే అరుణ మాట్లాడుతూ పోరాడి సాధిం చుకున్న తెలంగాణలో ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా నియంతర పాలన దుర్మార్గంగా అవినీతి పాలన సాగిస్తున్న బీఆర్ఎస్కు చర్మగీతం పడేసమయం ఆసన్నమైందన్నారు. కార్యక్రమంలో చంద్రధన సర్పంచ్ బక్కి కుమార్, శ్రీనివాస్ రెడ్డి, దుర్గాప్రసాద్, రాఘవేందర్‌గౌడ్, వెంకటేష్, పాండు, దుర్గయ్య, ఎంపీటీసీ రాజు, శ్రీకాంత్, పాండు ప్రసాద్, అనిల్, పవన్ వాల్మీకి పాల్గొన్నారు.
ఎమ్మార్పీఎస్ నాయకుల నిరసన
డీకే అరుణకు సభలో మాట్లాడుతూ ఉంటే ఎమ్మార్పీ ఎస్ నాయకులు నినాదాలతో ఒరెత్తిన జై ఎమ్మార్పీఎస్ అంటూ నినాదాలు చేశారు. పోలీసు వాళ్ళు ఎమ్మార్పీఎస్ నాయకులను కొద్దిసేపు నినాదాలు ఆపడంతో ఎమ్మార్పీ ఎస్ నాయకులు నినాదాలు ఆపారు. వెల్జాలలో తెలంగా ణ ప్రజా గోస-బీజేపీ భరోసా యాత్రతో భాగంగా శని వారం రాత్రి వచ్చిన నాయకులు బీజేపీ జాతీయ మహిళా ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, మాజీ బీసీ కమిషనర్ మెం బర్ బీజేపీ కల్వకుర్తి నియోజకవర్గ ఇన్చార్జి తల్లోజి ఆచా రికి ఎమ్మార్పీఎస్ నాయకులు డీకే అరుణకు వినతిపత్రం అందజేశారు. ఎమ్మార్పీఎస్ మండల నాయకులు రాజు మాదిగ మాట్లాడుతూ షెడ్యూల్ కులాల రిజర్వేషన్లను వర్గీకరణలో కేంద్ర ప్రభుత్వం అవలబిస్తుందని వైఖరిని చూస్తే మాదిగలను మోసం చేసినట్టేనని దుయ్యబట్టారు. షెడ్యూల్ కులాలను వర్గీకరణలో నమ్మకంతో ద్రోహినికి పాల్పడితే బీజేపీని వదిలే ప్రసక్తే లేదన్నారు. మాదిగ పల్లెల్లోకి బీజేపీని రానివ్వబోమని ఎస్సీ వర్గీకరణ విష యంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ బీజేపీకీ వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మండల నాయకులు రాజు మాదిగ, శ్రీశైలం, గణేష్, బాలు చెన్నయ్య, సతీష్, రవితేజ, హరికృష్ణ, మహేష్ పాల్గొన్నారు.