Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 227 భారీ మెజార్టీతో అసోసియేషన్ అధ్యక్షులుగా అబ్దుల్ గని
- అబ్దుల్ గనిని సన్మానించిన అసోసియేషన్ సభ్యులు
నవతెలంగాణ-తాండూరు
తాండూరులో లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నికలు అట్టహా సంగా కొనసాగాయి. అసోసియేషన్ అధ్యక్షులను అబ్దుల్ గని భారీ మెజా ర్టీతో గెలుపొందారు. ప్రధాన కార్యదర్శిగా నరసింహారెడ్డిని ఎన్నుకున్నా రు.గతంలో ఎన్ని లేనివిధంగా బ్యాలెట్ పత్రం ద్వారా ఎన్నికల నిర్వహిం చారు.ఎన్నికల అధికారిగా అడ్వకేట్ గోపాల్ వ్యవహరించారు. తాండూరులో బ్యాలెట్ పత్రాల ద్వారా మొట్టమొదటిసారిగా లారీ ఓనర్స్ అసోసియేషన్ ఎన్నికలను నిర్వహించడంతో అందరిలో ఆసక్తి నెలకొంది. లారీ ఓనర్స్ వెల్ఫే ర్ అసోసియేషన్ అధ్యక్ష పదవి కోసం ఇద్దరు పోటీలో ఉన్నారు. అధ్యక్ష పదవి కోసం అబ్దుల్ గనికి 243 ఓట్లు వచ్చాయి. టెంకాయల శ్రీనివాస్‌కు 16 ఓట్లు వచ్చాయి. తాండూరు లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్‌లో 261 మంది సభ్యులు న్నారు. అందులో 243 ఓట్లు పోలయ్యాయి. అబ్దుల్ గని భారీ మెజార్టీతో గెల వడంతో అసోసియేషన్ సభ్యులు ఘనంగా సన్మా నించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు ఇర్ఫాన్,అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.