Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి
నవతెలంగాణ-చేవెళ్ల
ఆధ్యాత్మిక చింతనతోనే విశ్వమానవ కల్యాణం జరు గుతుందని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. చేవెళ్ల మండల పరిధిలోని రామన్న గూడలో పోచమ్మ తల్లి ఆలయాన్ని పున్ణనిర్మించారు. రెండు రోజులుగా ఆలయ పున్ణప్రారంభం కార్యక్రమాలు చేప ట్టారు. హౌమాలు, యజ్ఞాలు, గణపతిపూజ, అమ్మవారి యజ్ఞం, విగ్రహా నాగుల ప్రతిష్టాపన గావించారు. ఆదివా రం ఆలయ పున్ణప్రారంభ కార్యక్రమ ఉత్సవాలకు ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కె.ఎస్.రత్నం. డీసీఎం ఎస్ చైర్మన్ పట్లోళ్ల కృష్ణారెడ్డి తదితర అతిరథ మహారథులు హాజరయ్యారు. సర్పంచ్ నడి మొల్ల లావణ్య శంకర్ ఆధ్వ ర్యంలో ఉత్సవాలు జరిగాయి. కార్యక్రమానికి ముఖ్యఅతి థులుగా హాజరై ఎమ్మెల్సీ మహేందర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కేఎఎస్. రత్నంకు పగిడి, శాలువాలతో సత్కరించారు. ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ..ప్రతిఒక్కరూ దైవ చింతనను అలవర్చుకోవాలని తద్వార మానవత విలువలు పెంపొందుతాయని, సమాజం సన్మార్గంలో పయనిస్తుం దన్నారు. వివరించారు. గ్రామ దేవత ఆలయ నిర్మాణానికి కృషిచేసిన ప్రతి ఒక్కరినీ ఆయన అభినందించారు. మాజీ ఎమ్మెల్యే కేఎస్. రత్నం మాట్లాడుతూ... ఆలయ నిర్మాణాలకు తనవంతు సహకారం అందిస్తామన్నారు. రా మన్నగూడ గ్రామస్తులంతా ఏకతాటిపైకి రావడం గ్రామం లో పండుగ వాతావరణం నెలకొనడం హర్షించదగ్గ విష యమన్నారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ దేవర వెం కట్ రెడ్డి, సర్పంచ్లు శైలజా ఆగిరెడ్డి, వెంకటేషంగుప్తా, రహిమాబేగం, ఉపసర్పంచ్ పెద్దోళ్ల సుదర్శన్, నియోజ కవర్గ బీఆర్ఎస్ యూత్ అధ్యక్షులు వనం లక్ష్మీకాంత్ రెడ్డి, గుడిమల్కాపూర్ మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ మంగలి యాదగిరి, ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ మాసన్నగారి మాణి క్య రెడ్డి, కాంగ్రెస్ నియోజకవర్గం నాయకులు సున్నపు వసంతం నాయకులు అలీ తదితరులు పాల్గొన్నారు.