Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నార్ముల్ డైరెక్టర్ వెంకట్రాంరెడ్డి
నవతెలంగాణ-పరిగి
సంస్కృతీ సాంప్రదాయాలను భవిష్యత్ తరాలకు అందించాలని నార్ముల్ డైరెక్టర్ వెంకట్రాంరెడ్డి అన్నారు. ఆదివారం పరిగి మండల పరిధిలోని లక్ష్మీదేవిపల్లిలో సత్య హరిచంద్ర వీధినాటకం ప్రదర్శించారు. నాటకానికి డీసీసీ బీ చైర్మన్ బుయ్యాని మనోహర్ రెడ్డి తన వంతు విరాళంగా రూ.20 వేలు ఆర్థిక సాయం తన అనుచరులతో అందజే శారు. ఈ సందర్భంగా వెంకట్రాంరెడ్డి మాట్లాడుతూ గతంలో వీధి నాటకాలకు ఎంతో ప్రాధాన్యత ఉండేదని తెలిపారు. రాను రాను చరిత్రను తెలిపే నాటకాల ప్రద ర్శనలు పూర్తిగా తగ్గిపోయాయన్నారు. వీటిని ప్రోత్సహిం చవలసిన అవసరం అందరిపై ఉందన్నారు. డీసీసీబీ చైర్మన్ మనోహర్ రెడ్డి అన్ని రంగాల వారిని ఆదరిస్తున్నా రని అన్నారు. ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు చేరువయ్యారని తెలిపారు. ఆపదలో ఉన్నవారికి ఆపనా హస్తం అందిస్తూ వారికి చేదోడువాదులుగా నిలుస్తున్నార న్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు నర్సి రెడ్డి, నగేష్, ప్రవీణ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.