Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు వెంకటరమణారెడ్డి
- నలంద గ్రామర్ హై స్కూల్ ఆధ్వర్యంలో సాంస్కృతిక క్రీడా దినోత్సవం
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
విద్యతో పాటు క్రీడలను, సాంస్కృతిని ప్రోత్సహించా లని, చదువులో సగభాగం క్రీడలను చేసుకోవాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు వెంకటరమణారెడ్డి అన్నారు. నలంద గ్రామర్ హై స్కూల్ ఆధ్వర్యంలో ఆదిభ ట్ల మున్సిపల్ పరిధిలోని బొంగులూరు సమీపంలో వై కన్వెన్షన్‌లో సాంస్కృతిక క్రీడా దినోత్సవ ఉత్సవాలను నిర్వ హించారు. ఈ ఉత్సవాలకు ఆయన హాజరై విద్యార్థులు ప్రదర్శించిన ఎగ్జిబిషన్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు చదువుతోపాటు క్రీడలను సాంస్కృతిక కల్చర్‌ను ప్రోత్సహించాలని అన్నారు. విద్యార్థులకు చదువులో మెలికలు నేర్పుతునే ప్రయోగాత్మక విద్యను ప్రోత్సహించి అత్యాధునిక సాంకేతిక విద్యను నేర్పించాలన్నారు. విద్యార్థులు క్రీడలు ఆడటం వలన శారీరక నైపుణ్యం మెరుగుపడుతుందన్నారు. వినోదం, క్రీడలు మానసిక ధైర్యాన్ని పెంచుతునే.. మిగతా రంగాల్లో రాణించడానికి ద్రోహ దపడతాయని తెలిపారు. విద్యార్థులు ఉపాధ్యాయులు చెప్పే పాఠ్యాంశాలను శ్రద్ధగా విని ఉన్నత శిఖరాలకు చేరుకో వాలని సూచించారు. చదువు తోపాటు క్రీడలకు ప్రాధా న్యం ఇవ్వాలని అన్నారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శిం చిన సాంస్కృతిక కార్యక్రమాలు, దేశభక్తి గీతాలు చూపరులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి వెంకట్‌రెడ్డి, మాజీ ఎంపీపీ వెంకట్రాంరెడ్డి, పాఠశాల కరస్పాండెంట్ వెంకటేశంయాదవ్, కార్తికేయ కళాశాల ప్రిన్సిపాల్ చంద్రకాంత్, శ్రీవిద్యానికేతన్ ప్రిన్సి పాల్ అశోక్‌గౌడ్, తదితరులు పాల్గొన్నారు.