Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అసత్య ప్రచారాలు చేస్తే గుణపాఠం చెబుతాం
- సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షులు దండు ఇస్తారి
నవతెలంగాణ-శంషాబాద్
మండల పరిధిలోని సుల్తాన్‌పల్లి భూమి విషయంలో రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్‌కు ఏలాంటి సంబంధం లేదని ఆ గ్రామ సర్పంచ్, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షులు దండు ఇస్తారి స్పష్టం చేశారు. రాజకీయ దురుద్దేశంతో ప్రతిపక్ష పార్టీల నాయకులు రాజేంద్రనగర్ ఎమ్మెల్యేపై చేస్తున్న అసత్య ప్రచారాలు, ఆరోపణలను తీ వ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్‌పై చేస్తున్న అసత్య ప్రచారాలను తిప్పికొడుతూ సుల్తాన్‌పల్లి గ్రామంలో ఆదివారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుల్తాన్‌పల్లి గ్రామంలో సర్వేనెంబర్ 129, 142లలో 25 ఎకరాల 10 గుంటల భూమిని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ద్వారా ప్రయివేటు వ్యక్తులు ప్రయివేటు భూమిగా ఆర్డర్ తెచ్చుకుని పట్టాదారు పాస్ పుస్తకాలు పొందారని తెలిపారు. ప్రభుత్వ భూమిగా ఉన్న ఈ భూమిలో గ్రామానికి చెందిన 84 మందికి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం 2007లో ఇందిరమ్మ ఇండ్ల స్థలాల పట్టా లు ఇచ్చిందని తెలిపారు. అయితే భూమి మొత్తం ప్రభుత్వా నికి చెందిందని ఇది సాంకేతిక కారణాలతో ప్రయివేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిందని ఇటీవల గ్రామానికి చెందిన కొంతమంది ఆందోళన చేపట్టిన విషయం అందరికి తెలిసిందే అన్నారు. ప్రభుత్వ భూమి అని గ్రామ ప్రజలకు ఇందిరమ్మ ఇండ్ల స్థలాలు ఇచ్చిన మాట వాస్తవమేనని అన్నారు. ఇది పూర్తిగా ప్రభుత్వ భూమి అని కొందరు దీనిపై కోర్టుకు వెళ్లారని కోర్టు తీర్పు ఎలా వస్తే అలా గ్రామ సర్పంచ్‌గా తాను, గ్రామస్తులు నడుచుకుంటామని తెలిపా రు. ఈ విషయాన్ని గోరంతని కొండంతలు చేస్తూ ఈ భూమి కుంభకోణంలో రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్ హస్తం ఉందని, తెర వెనక ప్రభుత్వ భూమి కాజేసిన వారికి అండగా ఉంటున్నారని ప్రతిపక్ష పార్టీల నాయకులు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్ అండదండలతోనే ప్రభుత్వ భూమి ప్రయివేట్‌గా మారిందనడం హాస్యాస్పదమని అన్నారు. ఈ వ్యవహారంలో ఎమ్మెల్యేకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ప్రతిపక్ష నాయకులు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని, లేదంటే తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కృష్ణ, చంద్రశేఖర్, అరుంధ వీరేశం, మాజీ ఉపసర్పంచ్ ఎం.కృష్ణ, బీఆర్ఎస్ నాయకులు జి.మల్లికా ర్జున్, ఇ.ప్రభాకర్, వై.రమేష్, పాండురంగారెడ్డి, బలవం త్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, కావలి ఈశ్వరయ్య, కే.దేవేందర్, సిద్ధిక్, శివ, రాజేందర్‌గౌడ్, మైలారం రాజు, ఎం. అశోక్ ఎం.సిద్దు, బి.యాదయ్య, తదితరులు పాల్గొన్నారు.