Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఏర్పుల గాలయ్య
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
ఉద్యోగ, ఉపాధ్యాయ సమ స్యల పరిష్కారం కోసం యూటీఎఫ్ అభ్యర్థి పాపన్నగారి మానిక్‌రెడ్డి ని గెలిపించా లని టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఏర్పుల గాలయ్య అన్నారు. మానిక్రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరుతూ ఇబ్రహీం పట్నంలోని ఉపాధ్యా యులను కలిసి విన్నవించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాపన్నగారి మానిక్రెడ్డికి మొదటి ప్రా ధాన్యత ఓటు వేసి అత్యధిక మెజారిటీతో ఎమ్మెల్సీగా గెలి పించాలని కోరారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యల ను పరిష్కరించాలని, విద్యారంగ పరిరక్షణకు ఉద్యమిస్తుం దన్నారు. ఈ తరుణంలో ఉపాధ్యాయుల ఉద్యమాలకు మరింత బలం చేకూర్చడం కోసం ఉపాధ్యాయులు చైతన్యంతో ఓటు వేయాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు బింగి రాములయ్య, జిల్లా కార్యదర్శి కిషన్ చౌహాన్, మంచాల మండల అధ్యక్షులు అజ్మత్‌ఖాన్, ఇబ్రహీంపట్నం ప్రధాన కార్యదర్శి కిరణ్, జిల్లా కౌన్సిలర్ లాలగారి నగేష్, జిల్లా కమిటీ సభ్యులు మోతిలాల్, కొరివి రవి, తదితరులు పాల్గొన్నారు.