Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పలు గ్రామాలకు రోడ్డు సౌకర్యం ఏర్పాటు
- హర్షం వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు
- వాహనదారులకు తీరిన ఇబ్బందులు
- ఎమ్మెల్యేకు ప్రత్యేక కృతజ్ఞతలు
ఒకప్పుడు ఆ గ్రామాలకు వెళ్లాలంటే గతుకులతో ఉన్న బాటనే గతి. మారుమూల ప్రాంతం. దీంతో రవాణా సౌకర్యం అంతంత మాత్రం. ఇక వానకాలం వచ్చిందంటే వాగులు పొంగి పొలాలకు వెళ్లాలన్న రైతులు అనేక ఇబ్బందులు పడుతూ వెళ్లాల్సి వచ్చేదిజ ఎడ్ల బండ్లు, ఆటో, ద్విచక్ర వాహనాలైన బురదలో కూరుకోపోవాల్సిందే. రోడ్ల పైన బురద ఏర్పడడంతో రోజులకు రోజులు ఆ మార్గంలో రవాణా బంద్. ఇలాంటి కష్టాల బాధ తీరింది. ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి చొరవతో కష్టాలు తీరాయి. దీంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
నవతెలంగాణ-కొడంగల్
దౌల్తాబాద్ మండలం గుండేపల్లి గ్రామం వికారాబాద్ జిల్లా కేంద్రానికి కర్నాటకకు అనుకొని ఉన్న ప్రాంతం. ఆ గ్రామాలకు వెళ్లాలంటే గోతులతో రాకపోకలకు తీవ్ర ఇబ్బంది కలిగేది. గత పాలకుల నిర్లక్ష్యానికి గురైన రహదా రులను ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి చొరవతో ముఖ్యమం త్రి కేసీఆర్ ప్రభుత్వం రోడ్లు అభివృద్ధి చేయడంతో ఈ ప్రాంతానికి రోడ్డు మార్గం ఏర్పడింది. ఈ క్రమంలో దౌ ల్తాబాద్ మండలం గుండెపల్లి ప్రధాన రహదారిపై గోతుల వలన ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులు తెలుసుకున్న ఎమ్మెల్యే తన సొంత నిధులతో చుట్టూ కంపను తొలగించారు. గుంతలు మట్టితో పూడ్చి వేయించారు.
సాఫీగా ప్రయాణం
నియోజకవర్గ, జిల్లా కేంద్రాలకు వెళ్లాలంటే గుండెపల్లి మీదుగా నాలుగు ఐదు గ్రామాల ప్రజలకు దగ్గరగా ఉంటుంది. గతుకుల రోడ్డుపై అవస్థలు గమనించిన ఎమ్మె ల్యే మట్టిని వేయాలని స్థానిక నాయకులకు తెలపడంతో వారు రోడ్లు బాగు చేయించారు. ఇప్పుడు ప్రమాణం సాఫీగా సాగుతోందని ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
ఇతర ప్రాంతాలకు వెళ్లాలంటే
నరకంగా ఉండేది
రోడ్డు ఉన్న చెరువు కట్టపై బావిని తలపించే విధంగా గుంతలు ఉండడంతో ఇతర ప్రాంతాలకు వెళ్లాలంటే బాలంపేట మీదుగా వెళ్లాల్సి వచ్చేది. చాలా సమయం వృథా అవడంతోపాటు వాహనదా రులకు అధిక భారంగా మారేది. చెరువుకట్టపై మట్టి వేయడంతో నియోజకవర్గ కేంద్రానికి, జిల్లా కేంద్రానికి వెళ్లాలన్న చాలా దగ్గర కావడంతోపాటు భారం తగ్గి అనుకూలంగా మారిందని స్థానికులు తెలిపారు. ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
బాలంపేట నుంచి గుండెపల్లి మీదుగా బిచ్చాల్ గ్రామం వెళ్లాలని బీటీరోడ్డు నిర్మించారు. రెండు కల్వర్టు వాగుపై ఏర్పాటుచేసి బిచ్చల్ చెరువు కట్టపై బావిని తలపించే విధంగా గుంతలు ఉండడంతో ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి దృష్టికి స్థానిక నాయకులు తీసుకెళ్లారు. దీంతో ఎమ్మెల్యే సొంత నిధులతో చుట్టూ ఉన్న పొదలను తొలగించి బావిని తలపించే విధంగా ఉన్న గుంతలను పూడ్చి మట్టి వేయడంతో ప్రయాణికుల కష్టాలు తీరాయి. ఇప్పుడు ఈ మార్గంలో వాహనాలు రరు. రరు మంటూ దూసుకుపోనున్నాయి.
అప్పుడు దారి ఉన్న రాకపోకలకు ఇబ్బంది
రైతులు పొలాలకు వెళ్లాలంటే కష్టంగా ఉండేది. రోడ్డు నిర్మించిన చెరువు కట్టపై బావిని తలపించే విధంగా గుంతలు ఉండడంతో వాహ నదారులు ఇబ్బందులు పడేవారు. ఇప్పుడు కొత్తగా మట్టి రోడ్డు వేయడంతో వాహనాల రాకపోకలకు సులభంగా మారింది.
- సాయి రెడ్డి, స్థానికుడు
చాలా సంతోషంగా ఉంది
బిచ్చల్ చెరువు కట్టపై రోడ్డు అధ్వానంగా ఉందని ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి దృష్టికి తీసుకువెళ్లిన వెంటనే తన సొంత నిధులతో గుంతలపై మట్టి వేయడంతో వాహనదారులు ఇబ్బందులు తొల గాయి. చుట్టు ఉన్న గ్రామాలకు రాకపో కలకు సులభతరంగా మారింది. స్పందించిన ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు.
- మధుసూదన్ రెడ్డి, సర్పంచ్
గుంతలు పూడ్చడంతో తీరిన ఇబ్బందులు
గతంలో గుంతలతో అవస్థలు పడేవాళ్ళం. ఒక ఊరి నుంచి మరొక ఊరికి వెళ్లా లంటే గుంతల రోడ్లతో గంటల సమయం పట్టేది. కానీ మట్టి వేయడంతో ఆ పరిస్థితులు మారిపోయాయి. మట్టి రోడ్డు వేయడంతో చాలా సంతోషం గా ఉంది. గతంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోయాయి.
- నాగప్పజి, స్థానికుడు
కళాశాలకు వెళ్లాలంటే ఇబ్బందిగా ఉండేది
గుండెపల్లి నుండి బిచ్చల్కు వెళ్లాలంటే నడవడానికి సైతం ఇబ్బందిగా ఉండేది. ఈ రోడ్డుపై నరకాన్ని చూసేది. రెండేండ్ల కిందట ప్రభుత్వం బీటీరోడ్డు నిర్మించిన చెరువు కట్టపై మట్టి రోడ్డు వేయడంతో గుంతలు పడి వాహనాలు వెళ్లడం ఇబ్బందిగా ఉండేది. ఇప్పుడు మట్టి వేయడంతో కళాశాలకు వెళ్లాడానికి సులువుగా మారడంతో పాటు సమయం వృథా కాకుండా ఉంటుంది. మట్టి రోడ్డు వేయడంతో రాకపోకలు సాఫీగా సాగుతాయి.
- అనిల్, విద్యార్థి