Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
మండల పరిధిలోని ఎలిమినేడు గ్రామంలో ఇబ్రహీం పట్నం ప్రముఖ స్మార్ట్ ఈషా హాస్పిటల్ ఆధ్వర్యంలో మనగుడి దేవుని నరసింహగౌడ్ వర్థంతిని పురస్కరించుకుని వైద్య శిబిరం నిర్వహించారు. బీపీ, షుగర్, థైరాయిడ్, గుండె, కిలనొప్పులకి చిన్నపిల్లలకు సంబంధించిన అన్ని రకాల వ్యాధులకు సంబంధించి 315 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం మందులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా హాస్పిటల్ మేనేజ్మెంట్ డైరెక్టర్ డాక్టర్ కర్వాంగా సంపత్‌గౌడ్, సీనియర్ పీడియాటిషన్ మాట్లాడుతూ వైద్య వృత్తి వ్యాపారంగా మారుతున్న ఈ రోజులలో ఇబ్రహీం పట్నంలోని స్మార్ట్ ఈషా హాస్పిటల్లో తక్కువ ధరలకే అత్యంత ఖరీదైన వైద్యం అందజేసినట్లు తెలిపారు. తక్కువ ఫీజులతో మెరుగైన వైద్యం అందిం చడమే తమ హాస్పిటల్ లక్ష్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ ప్రతాప్‌రెడ్డి, సర్పంచ్ అశోకవర్ధన్ రెడ్డి, అవినాష్ రెడ్డి, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, కో-ఆప్షన్ సభ్యులు, డైరెక్టర్లు, చిన్నపిల్లల వైద్యులు డాక్టర్ మహిధర్, డాక్టర్ మనోజ్‌కుమార్, జనరల్ సర్జన్ డాక్టర్ ప్రణరు, చర్మవ్యాధి నిపుణులు ప్రదీప్, జనరల్ ఫిజీషియన్ డాక్టర్ కార్తీక్, డాక్టర్ హరీశ్వర్ రెడ్డి, అడ్మిన్ స్టేషన్ నీరజ్‌రెడ్డి, జక్కుల వెంకటేష్, మార్కెటింగ్ శ్రీకాంత్, సాయి, భానుకుమార్, శివ నర్సింగ్, సిబ్బంది గ్రామీణ వైద్యులు, తదితరులు పాల్గొన్నారు.